బ్యాంకాక్ బీచ్ లో ఆ పని చాలా కష్టం : పూరి

Mon Jan 17 2022 16:05:21 GMT+0530 (IST)

Puri Jagannath In Unstoppable With NBK

డైరెక్టర్ పూరి జగన్నాధ్ అనగానే అందరికి బ్యాంకాక్ గుర్తుకు వస్తుంది అనడంలో సందేహం లేదు. ఆయన సినిమా ప్రారంభంకు ముందు.. పూర్తి అయిన తర్వాత చిల్ అవ్వడానికి బ్యాంకాక్ వెళ్తాడని అంటూ ఉంటారు. ఆయన తనకు బ్యాంకాక్ అంటే చాలా ఇష్టమని పలు సందర్బాల్లో అన్నాడు. బ్యాంకాక్ లో షూటింగ్ చేయడం మాత్రమే కాకుండా బ్యాంకాక్ లో స్క్రిప్ట్ వర్క్ చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. అలా బ్యాంకాక్ వెళ్లి స్క్రిప్ట్ ను పూర్తి చేసుకుని వస్తాడు.. కథను రాసుకుని వస్తాడు అనే టాక్ ఉంది. పూరి జగన్నాద్ అలా బ్యాంకాక్ బీచ్ లో కూర్చుని స్క్రిప్ట్ రాస్తూ ఉంటాడని.. అతడు చాలా ప్రశాంతమైన బ్యాంకాక్ బీచ్ లో స్క్రిప్ట్ ను రెడీ చేయడం ద్వారా చాలా వరకు ఫ్రెష్ స్క్రిప్ట్ మరియు కథలు వస్తాయని అంటూ ఉంటారు.తాజాగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో లో పూరి జగన్నాద్ పాల్గొన్నాడు. తాను దర్శకత్వం వహిస్తున్న లైగర్ హీరో విజయ్ దేవరకొండ మరియు నిర్మాత ఛార్మి తో కలిసి ఆయన రావడం జరిగింది. పూరి తో మొదట పలు విషయాలను గురించి మాట్లాడిన బాలయ్య ముఖ్యంగా బ్యాంకాక్ ముచ్చట్లను అడిగి తెలుసుకున్నాడు. బ్యాంకాక్ బ్యాంకాక్ అంటూ ఉంటారు... అసలు బ్యాంకాక్ కు వెళ్లి నువ్వు ఏం చేస్తావ్.. అక్కడ బీచ్ లో కూర్చుని అలా అలా స్క్రిప్ట్ లను అంత సులభంగా ఎలా రాస్తావు అంటూ బాలయ్య ప్రశ్నించగా పూరి జగన్నాద్ స్పందిస్తూ బ్యాంకాక్ బీచ్ లో కూర్చుని స్క్రిప్ట్ ను రాయడం అనేది చాలా కష్టమైన విషయం. అక్కడ ఉండే ఎంటర్ టైన్మెంట్ కు అస్సలు స్క్రిప్ట్ రాయలేమని కుండబద్దలు కొట్టాడు.

అలాంటి వాతావరణంలో కూర్చుని నిబద్దతతో కూర్చుని స్క్రిప్ట్ వర్క్ చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పుకొచ్చాడు. అలాంటి ప్లేస్ లో మనం కష్టపడితేనే మన ఏకాగ్రత ఎంత అనేది మనకు అర్థం అవుతుంది. నేను ఉదయం నుండి సాయంత్రం వరకు బీచ్ లో ఉంటాను. ఆ సమయంలో రిలాక్స్ అయ్యి సాయంత్రంకు రూముకు చేరుకుని హోటల్ రూమ్ లో స్క్రిప్ట్ వర్క్ చేస్తాను. అలా చేయడం వల్ల చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందని పూరి చెప్పుకొచ్చాడు. హోటల్ రూమ్ లో స్క్రిప్ట్ రాసుకోగలం కాని బీచ్ లో కూర్చుని అంత నిబద్దతతో స్క్రిప్ట్ రాసుకోవడం అంటే సాధ్యం అయ్యే పని కాదని పూరి చెప్పుకొచ్చాడు. మరోసారి తనకు బ్యాంకాక్ పై ఉన్న అభిమానం ను మరియు ప్రేమను బాలయ్య టాక్ షో లో చెప్పుకొచ్చాడు. అక్కడ తనకు ఉన్న పరిచయాలతో ఎన్నికల్లో పోటీ చేసినా గెలుస్తాను అన్నట్లుగా పూరి ఒక సారి కామెంట్స్ చేసిన విషయం తెల్సిందే.