Begin typing your search above and press return to search.

పూరి పోడ్‌ కాస్ట్‌ పై బన్నీ ప్రశంసలు

By:  Tupaki Desk   |   13 Aug 2020 6:30 AM GMT
పూరి పోడ్‌ కాస్ట్‌ పై బన్నీ ప్రశంసలు
X
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాద్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటారనే విషయం తెల్సిందే. ప్రస్తుతం ట్రెండ్‌ అవుతున్న పోడ్‌ కాస్ట్‌ ద్వారా కూడా పూరి తన అభిమానులకు మరియు ప్రేక్షకులకు దగ్గరగా ఉంటున్నాడు. పోడ్‌ కాస్ట్‌ ద్వారా ఎన్నో విషయాలను ఆయన చర్చిస్తున్నాడు. ఆయన చర్చిస్తున్న విషయాలను ఆలోచింపజేసేవిగా ఉన్నాయంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. తాజాగా పూరి పోడ్‌ కాస్ట్‌ పై స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా స్పందించాడు. ఈ సందర్బంగా పూరిపై ప్రశంసలు కురిపించాడు.

ట్విట్టర్‌ లో బన్నీ.. పూరి గారు మీరు ఎంపిక చేసుకున్న టాపిక్‌ అద్బుతం. మీరు చెబుతున్న అభిప్రాయాలు గొప్పగా అనిపించాయి. నాకు వ్యక్తిగతంగా చాలా బాగా నచ్చాయి. ఇలాంటి పోడ్‌ కాస్ట్‌ లు మరిన్ని చేయాలంటూ కోరుకుంటున్నాను అంటూ ట్వీట్‌ చేశాడు. బన్నీ ట్వీట్‌ కు పూరి సరదాగా సమాధానం చెప్పాడు. నీ ట్వీట్‌ నాకు చాలా ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇచ్చింది. నీలాంటి సక్సెస్‌ ఫుల్‌ యంగ్‌ స్టర్‌ నుండి ఇలాంటి ప్రశంస అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనందంలో రాత్రి మరో పెగ్‌ ఎక్కువ వేస్తాను చీర్స్‌ అంటూ ట్వీట్‌ చేశాడు.