Begin typing your search above and press return to search.

కొడుకుని నిలబెట్టడం కోసం గ్రాఫిక్స్ నే నమ్ముకున్న పూరీ..?

By:  Tupaki Desk   |   8 April 2020 9:30 PM GMT
కొడుకుని నిలబెట్టడం కోసం గ్రాఫిక్స్ నే నమ్ముకున్న పూరీ..?
X
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు పూరీ ఆకాష్ 'మెహబూబా' సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. చిరుత, బుజ్జిగాడు చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆకాష్ ఈ సినిమా ద్వారా పూర్తి స్థాయి హీరోగా టాలీవుడ్ లో ఎంటర్ అయ్యాడు. భారీ ఆశలు పెట్టుకుని తీసిన మెహబూబా సినిమా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు ఎలాగైనా తనయుడికి హిట్ ఇవ్వాలనే కసితో కనిపిస్తున్నాడు పూరీ జగన్నాథ్. 'ఇస్మార్ శంకర్‌' సినిమాతో తాను హిట్ కొట్టాడు కానీ తన కొడుకు విషయంలో మాత్రం అలాగే బాకీ పడిపోయాడు పూరీ జగన్నాథ్.

దీని కోసం పూరీ కథ - స్క్రీన్ ప్లే - మాటలు రాసి కొత్త దర్శకుడు అనిల్ పాడూరికి దర్శకత్వ భాధ్యతలు అప్పగించాడు. ఈ సినిమాకు 'రొమాంటిక్' అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసాడు. ఇప్పటికే విడుదలైన బీచ్ సాంగ్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత విడుదలైన పాటకు కూడా మంచి స్పందనే వచ్చింది. ఇందులో ఆకాశ్‌ కు జోడీగా ముంబై ముద్దుగుమ్మ కేతికా శర్మ నటిస్తుంది. ఈ భామ కూడా పూర్తిగా అందాల ఆరబోతకు రెడీ అయింది. పూర్తిగా బీచ్‌ అందాల మధ్య అన్నీ ఆరబోసింది ఈ ముంబై బ్యూటీ. ఏకంగా క్లీవేజ్ షోతో పిచ్చెక్కించింది ఈ భామ. పేరుకు తగ్గట్టే ఈ సినిమాలో రొమాన్స్ పాళ్ళు కూడా ఎక్కువనే విషయం ఈ మధ్య రిలీజైన వీడియోల ద్వారా అర్థం అవుతోంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చాలా వరకు గోవాలో చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాతో ఎలాగైనా తన కొడుకుని నిలబెట్టాలనుకుంటున్న పూరీ దగ్గరుండి తనయుడితో రొమాన్స్ చేపిస్తున్నాడు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకి వచ్చింది. అయితే రొమాన్స్ తో మాత్రమే హిట్ కొట్టలేమని భావించి ఈసారి రొమాన్స్ తోపాటు గ్రాఫిక్స్ ని కూడా నమ్ముకున్నాడట పూరీ. తన కొడుకు సినిమాలో రొమాన్స్ పాళ్ళు బాగానే పెట్టిన పూరీ దాంతోపాటు వియఫ్ ఎక్స్ కి ప్రాధాన్యత ఇస్తున్నాడని సమాచారం. అందుకోసమే ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను వియఫ్ ఎక్స్ డిజైనర్ అనిల్ పాడూరి చేతిలో పెట్టాడట పూరీ. పాపం తమ్ముడిని ఇండస్ట్రీలో నిలబెట్టలేని పూరీ ఈసారి ఎలాగైనా కొడుకుని నిలబెట్టాలని కసితో ఉన్నాడట. మరి పూరీ కోరిక ఈ రొమాంటిక్ సినిమా ద్వారా తీరుద్దేమో చూడాలి. మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న రొమాంటిక్‌ సినిమాను పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌ - పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌ - ఛార్మిలు కలిసి నిర్మిస్తున్నారు.