మహేష్ గురించి పూరి కామెంట్స్ మిస్ ఫైర్

Fri Jul 19 2019 18:23:57 GMT+0530 (IST)

మహేష్ బాబుతో పూరి జగన్నాధ్ ఇప్పటికే 'పోకిరి' మరియు 'బిజినెస్ మన్' చిత్రాలు చేసిన విషయం తెల్సిందే. ఈ రెండు చిత్రాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా పోకిరి అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. బిజినెస్ మన్ తర్వాత వీరిద్దరి కాంబోలో 'జనగణమన' చిత్రం రావాల్సి ఉంది. పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించాడు. అయితే మహేష్ బాబు ఇతరత్ర సినిమాలు మరియు పూరి ఫామ్ కారణంగా ఆ సినిమా పట్టాలెక్కలేదు.తాజాగా పూరి 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబుతో 'జనగణమన' ఎప్పుడు అంటూ ప్రశ్నించగా నేను ఎప్పుడైతే హిట్స్ లో ఉంటానో అప్పుడే నాతో మహేష్ బాబు సినిమాను చేసేందుకు ముందుకు వస్తాడంటూ పూరి కామెంట్స్ చేశాడు. సక్సెస్ లో ఉంటేనే మహేష్ తనతో సినిమా చేస్తాడంటూ పూరి చేసిన వ్యాఖ్యలపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.

గతంలో పూరి వరుసగా మూడు ఫ్లాప్ లు తీసినా కూడా పోకిరి సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా సక్సెస్ లేకుండా ఉన్న పూరికి బిజినెస్ మన్ తో మళ్లీ బూస్ట్ ఇచ్చాడు. అలాంటి మహేష్ గురించి పూరి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తాడంటూ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. మహేష్ సక్సెస్ లను చూసి సినిమా చేస్తాడంటూ పూరి వ్యాఖ్యలను ఫ్యాన్స్ అర్థం చేసుకుని రెచ్చి పోతున్నాడు. మరి పూరి ఉద్దేశ్యం ఏంటో ఆయన మళ్లీ స్పందిస్తే అప్పుడు క్లారిటీ వచ్చేను.