పూరి క్రేజీ ప్రాజెక్ట్ ఇంకా చర్చల్లోనే వుందా?

Tue Oct 13 2020 15:08:59 GMT+0530 (IST)

Puri Jagannadh to direct Yash?

వెండితెరపై హీరోలని సరికొత్త యాంగిల్లో ఆవిష్కరించడంలో పూరి స్పెషలిస్ట్. `బద్రి` నుంచి `ఇస్మార్ట్ శంకర్` వరకు ఇది జగమెరిగిన సత్యమే. అతని స్టైల్ కి ఫిదా అయిన హీరోలు ఒక్క సినిమా అయినా పూరితో చేయాలని ఆశపడుతుంటారు. స్టైలిష్ హీరోని.... క్లాస్ ఇమేజ్ వున్న స్టార్ ని మాస్ హీరోగా తీర్చి దిద్దడంతో పూరి తరువాతే ఎవరైనా. గత కొంత కాలంగా రేసులో వెనకబడ్డ పూరి `ఇస్మార్ట్ శంకర్`తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చారు.ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా `ఫైటర్` చిత్రాన్ని చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ గత ఏడు నెలలుగా ఆగిపోయింది. త్వరలోనే ప్రారంభించాలని పూరి ప్లాన్ చేస్తున్నాడు. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత భారీ స్థాయిలో ఓ పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని తెరపైకి తీసుకురావాలని పూరి ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు షికారు చేస్తున్నాయి. ఇందులో హీరోగా `కేజీఎఫ్` స్టార్ యష్ నటిస్తారని ఇటీవల వార్తలు వినిపించాయి.

ఆ వార్తలపై పూరి స్పందించకపోవడంతో ఈ ప్రాజెక్ట్ రూమరే అని అంతా అనుకున్నారు. అయితే తాజా వార్తల ప్రకారం పూరి - యష్ ల కలయికలో సినమా నిజమనే సంకేతాలు వినిపిస్తున్నాయి. `కేజీఎఫ్ చాప్టర్ 2` తరువాత వీరి కలయికలో సినిమా వుంటుందని తెలుస్తోంది. దీనిపై పూరి త్వరలోనే ప్రకటన చేసే అవకాశం లేకపోలేదని తెలిసింది.