Begin typing your search above and press return to search.

పేరెంట్స్ కోసం నిజంగా నిల‌బ‌డేది కూతుళ్లే-

By:  Tupaki Desk   |   28 Sep 2020 3:45 AM GMT
పేరెంట్స్ కోసం నిజంగా నిల‌బ‌డేది కూతుళ్లే-
X
వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ పూరి మ్యూజింగ్స్ పేరుతో త‌నకి తెలిసిన విష‌యాల్ని అభిమానుల‌తో పంచుకుంటున్న విష‌యం తెలిసిందే. సోమ‌వారం 53 పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆదివారం ఆడ‌వాళ్ల‌ గురించి మ‌రీ ముఖ్యంగా డాట‌ర్స్ గురించి గొప్ప‌గా చెప్పారు. దానికి సంబంధించిన ఆడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. `ఇండియాలో చాలా మంది వారి క‌డుపున అబ్బాయే పుట్టాల‌ని కోరుకుంటారు. అమ్మాయి మాత్రం వ‌ద్దు. అమ్మాయి పుట్ట‌గానే అప్సెట్ అయిపోయిన చాలా మంది మ‌గాళ్ల‌ని చూశాను. ఇండియాలో స‌ర్వే చేస్తే తెలిసింది. ఫ‌ఫ్టీ ప‌ర్సెంట్ ఆడ‌వాళ్లు కూడా అబ్బాయే కావాల‌ని కోరుకుంటున్నారు. ఎందుకంటే మెయిన్ రీజ‌న్ ఓల్డ్ ఏజ్ ‌లో కొడుకైతే అమ్మానాన‌ని చూసుకుంటాడు. కూతురైతే పెళ్లి చేసుకుని ఎళ్లిపోద్ది అనిఅది వాళ్ల భ్ర‌మ‌.

కొడుకు చూస్తాడ‌ని గ్యారెంటీ లేదు. పేరెంట్స్ ‌ని రోడ్డుమీద వ‌దిలేసిన ఎంతో మంది కొడుకులున్నారు. కానీ అత్తింట్లో వున్నా అమ్మా నాన్న‌ల్ని చూసుకునే ఎంతో మంది కూతుళ్లున్నారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు మోర్ ఎమోష‌న‌ల్ మోర్ రెస్పాన్సిబుల్. కూతుర్ని బాగా చ‌దివిస్తాం. కానీ పెళ్లి చేసేసి ఎవ‌డో కిచ‌న్‌లో మ‌న‌మే ప‌డేస్తాం. వాళ్లు ఎద‌గ‌డానికి ఎప్పుడూ హెల్ప్ చేయం. దీని పెళ్లైపోతే చాలు అనే మూడ్‌ లో వుంటాం. బ‌ట్ కూతుళ్ల మ‌న‌సెప్పుడూ త‌ల్లిదండ్రుల‌మీదే వుంట‌ది. అమ్మానాన్న‌ల గురించి ఆలోచిస్తుంటారు. మొహం మీదే అమ్మానాన్న‌ల గురించి తిట్టినా మ‌గాళ్లు ఏమీ అన‌రు. అదే ఆడ‌పిల్ల‌ని వాళ్ల అమ్మా నాన్న గురించి ఒక్క మాట అ‌నండి మీ అంతు చూస్తారు. పేరెంట్స్ కోసం నిజంగా నిల‌బ‌డేది కూతుళ్లే. నిజంగా సేవ చేసేది కూడా వాళ్లే. పెళ్లి చేసి చేతులు దులిపేసుకోవ‌డం కాదు. కూతురు కెరీర్ గురించి ఆలోచించ‌డం నేర్చుకోవాలి. మ‌న ఓల్డేజ్ ప్లాన్ కోసం కాదు. కొడుకుల్లాగే వాళ్లూ ఎద‌గాలి. కాళ్ల మీద నిల‌బ‌డేలాగ చూడాలి. వాళ్ల‌కి వాళ్ల ఒపీనియ‌న్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలి. పెళ్లొద్దు అంటె మానెయ్యాలి. బిజినెస్ చేస్తాను అంటే చేయ‌మ‌నాలి. కొండెక్కుతాను నాన్నా అంటే ఎక్క‌మ‌నాలి. ద‌య‌చేసి కూతుళ్ల‌ని తీసుకెళ్లి కిచెన్‌ లో ప‌డేయ‌కండి.

ఆడ‌వాళ్ల‌కి సెక్యూరిటీ సెఫ్టీ వున్న దేశాలు ఏంటా అని గూగుల్ చేశా. నార్వే, స్విర్జ‌ర్లాండ్, ఫిన్ ల్యాండ్‌, డెన్మార్క్‌, ఆస్ట్రేలియా.. , యునైటెడ్ కింగ్‌డ‌మ్‌.., లక్సెంబర్గ్, .. స్వీడ‌న్‌,.. నెద‌ర్లాండ్స్..‌, కెన‌డా, ... ఇస్సోనియా.., స్లోవేనియా.., న్యాజిల్యాండ్, .. స్పెయిన్‌,.. ఐర్లాండ్‌, జ‌ర్మ‌నీ,. పోర్చుగ‌ల్‌, . .. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.., ఫ్రాన్స్ నేను చ‌దివింది టాప్ 20 కంట్రీస్‌. ఇందులో మ‌న దేశం పేరు లేదు. చాలా బాధ‌నిపించింది. పోనీ టాప్ 40లో వుంటుంద‌ని చూశా లేదు. చివ‌రికి టాప్ 100లో కూడా మ‌న దేశం పేరు లేదు. వ‌ర‌స్ట్ కంట్రీస్ ఫ‌ర్ ఉమెన్ అని కొట్టాఅందులో వుంది మ‌న దేశం పేరు ఇండియా అని. వేరే కంట్రీస్‌లో అమ్మాయికి స‌పోర్టీవ్‌ గా ఎన్నో వున్నాయి. ఎడ్యుకేష‌న్‌, ఉమెన్ లెవెల్ ఆఫ్ పార్టిసిపేష‌న్ ఇన్ ఎక‌న‌మిక్ సోష‌ల్ అండ్ పొలిటిక‌ల్ ఆపార్చునిటీస్‌. ఎంప్లాయ్‌మెంట్‌.. ఫైనాన్షియ‌ల్ యాక్సెస్‌.. ఇవి కాకుండా సెక్యూరిటీ.. క‌ట్టుకున్న మొగుడు కొట్ట‌డం గానీ అర్ధ్ర‌రాత్రి ఒంట‌రిగా న‌డ‌వ‌డం గానీ.. దానికి స‌పోర్ట్‌ గా జ‌స్టీస్ సిస్ట‌మ్‌.. తాట‌తీస్తార‌క్క‌డ ఆద‌డాన్ని ఏమైనా అంటే. కాబ‌ట్టి మ‌నం కూడా మ‌రదాం. సొసైటీ కాదు కూతుళ్ల ప‌ట్ల ముఖ్యంగా పేరెంట్స్ యాటిట్యూడ్ మారాలి అప్పుడే దేశం మారుద్ది. కొత్త కూతుళ్లు క‌న‌క్క‌ర్లా ఆల్ రెడీ వున్న కూతుళ్ల‌ని బాగా చూసుకుంటే చాలు గుర్తు పెట్టుకోండి అమ్మానాన్న కోసం కంట‌త‌డి పెట్టేది ఎప్పుడూ ఆడ‌కూతురే. మీ ఆడ‌పిల్ల మీ ఇంటి ల‌క్ష్మీ దేవి అని మీరు ఫీలైతే తీసుకెళ్లి ఎవ‌డో కొంప‌ల్లో ప‌డేయ‌కండి. మై సెల్యూట్ టు ఆల్ మైండెడ్ పేరెంట్స్ అండ్ ఇండిపెండెంట్ డాట‌ర్స్‌` అంటూ అమ్మాయిల గురించి పూరీ చెప్పిన మాట‌లు ప్ర‌తీ ఒక్క‌రిలోనూ ఆలోచ‌న రేకెత్తిస్తున్నాయి.