థియేటర్లకు ప్రత్యామ్నాయం వెతకాలా పూరి?

Sat Nov 21 2020 23:59:24 GMT+0530 (IST)

Puri Jagannadh On Theaters

నాలుగు ఫైట్లు.. ఐదు పాటలు.. మాస్ ని మెప్పించే కమర్షియల్ ఎలిమెంట్స్ .. జమానా కాలం నుంచి తెలుగు సినిమా ఫార్ములా ఇదే. ఇప్పటికీ ఇది మారడంలేదు అన్న విమర్శల నడుమ నెమ్మదిగా ఇప్పుడిప్పుడే టాలీవుడ్ మారుతోంది. ఇక్కడ కథలు మారుతున్నాయి. ప్రయోగాత్మక కథాంశాలతో నవతరం దర్శకులు ఉరకలెత్తిస్తున్నారు.తాజాగా పూరి జగన్నాథ్ కూడా ఇదే విషయాన్ని తనదైన శైలిలో తెలిపారు. ఇంతకుముందులా సినిమా వీక్షణ లేదని జనం ఓటీటీలపై ఆధారపడుతున్నారని ఆయన అన్నారు. డిజిటల్ వీక్షణ వల్ల తెలుగుతో పాటు అన్ని భాషల సినిమాలు వరల్డ్ సినిమాకి తెలుగు జనం అలవాటు పడ్డారని తెలిపారు. 50 శాతం వరకూ వరల్డ్ సినిమా వీక్షించే వాళ్లు పెరిగారని అన్నారు.

థియేటర్లకు వచ్చి చూసే జనాలు ఇకపై తగ్గుతారని.. ముఖ్యంగా ఓటీటీ కీలక పాత్ర పోషిస్తుందని పూరీ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే మాస్ జనం థియేటర్లకు రాకపోతే ఎలా? అన్న ప్రశ్న ఎదురైతే.. మైండ్ సెట్ మారాలని చెప్పకనే చెప్పారు. థియేటర్లకు ప్రత్యామ్నాయం వెతకాలన్న అంతర్లీన సందేశం ఇచ్చారు పూరి.