టాలీవుడ్ ని హీటెక్కించిన పూరి భామలు!

Fri May 13 2022 05:00:02 GMT+0530 (IST)

Puri Films Actress in Tollywood

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సినిమాలో హీరోయిన్ అంటే కచ్చితంగా ఫ్రెష్ ఫేస్ అయిండాలి. ఆయనెప్పుడే  కొత్త భామలకే  పెద్ద పీట వేస్తారు. అందమైన ముంబై మోడల్స్ ని దిగుమతి చేయడం పూరికే చెల్లింది.  హీరోయిన్ల ఎంపిక విషయంలో పూరి టేస్ట్ చాలా ప్రత్యేకమైనది. పూర్తిగా పూరి కంటెంట్ కి కంపర్ట్ బుల్ గా ఉండే వాళ్లనే తీసుంటారు.  సౌత్ భామల వైపు..తెలుగు హీరోయిన్ల వైపు పూరి చూపుండదు. తన సినిమా పూర్తి స్థాయిలో ప్రోజెక్ట్ చేయగల సత్త ఉన్న వాళ్లనే ఎంపిక చేసుకుంటారు. 'బద్రీ' దగ్గర నుంచి 'లైగర్' వరకూ పూరి సినిమాల్లో దాదాపు ముంబై హీరోయిన్లే ఎక్కువ మంది ఉంటారు. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే ఆసక్తికర సంగతులే తెలుస్తాయి.పూరి తొలి సినిమా 'బద్రీ'లో ఏకంగా ఇద్దరు ముంబై భామల్ని  హీరోయిన్లగా  తెలుగు తెరకు పరిచయం చేసారు.  వాళ్లే అమీషా పటేల్..రేణు దేశాయ్. ఆ సినిమా సక్సెస్ తో ఇద్దరికి మంచి పేరొచ్చింది. కానీ ఇక్కడ  హీరోయిన్లగా కొనసాగలేదు. ఆ తర్వాత 'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం' సినిమాతో తను రాయ్ ని హీరోయిన్ గా పరిచయం చేసారు. ఆ సినిమా పెద్ద సక్సెస్ అయింది కానీ తను రెండు..మూడు సినిమాలతోనే నిష్క్రమించింది.

ఇక 'ఇడియట్' తో యువత గుండెలు కొల్లగొట్టింది రక్షిత. అటుపై  కొన్ని సినిమాల్లో నటించి క్రేజీ హీరోయిన్ గా మారింది. అలాగే 'అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి' సినిమాతో  అసిన్ ని టాలీవుడ్ లో లాంచ్ చేసింది పూరినే. ఈ సినిమా సక్సెస్ తో అసిన్ కెరీర్ మారిపోయింది. తెలుగులో కొన్ని సినిమాలు చేసిన అనంతరం బాలీవుడ్ కి వెళ్లిపోయి అక్కడ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. పెద్ద వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుని స్థిరపడిపోయింది. పూరి సోదరుడు సాయిరాం నటించిన  '143' సినిమాతో సమీక్ష పరిచయమైంది కానీ పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయింది.

అలాగే  స్వీటీ అనుష్కని టాలీవుడ్  లో స్టార్ హీరోయిన్ ని చేసింది పూరినే. 'సూపర్' సినిమాతో బెంగుళూరు అమ్మాయిని హైదరాబాద్ కి రప్పించి మరీ స్టార్ హీరోయిన్ చేసాడు. తొలి సినిమా తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి. అలా ఒక్కొ మెట్టు ఎక్కుతూ అనుష్క  'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా నటి అయింది. తెలుగులో సోలో హీరోయిన్ గా ఎదిగింది.

ఆపిల్ అందం హన్సికని లాంచ్ చేసింది కూడా పూరినే. 'దేశ ముదురు సినిమా'తో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు కొన్నాళ్ల పాటు దున్నేసింది. అటుపై కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. బాలీవుడ్ క్వీన్ గా వెలిగిపోతున్న కంగనా రనౌత్ ని 'ఏక్ నిరంజన్' తో పరిచయం చేసాడు. అప్పటికి బాలీవుడ్ లో సినిమాలు చేసినా 'ఏక్ నిరంజన్' తర్వాత బాలీవుడ్ లో ఆమె ఫేట్ మారిపోయింది.

వరుస అవకాశాలు కంనగని బిజీ హీరోయిన్ ని చేసాయి. 'నేనింతే' సినిమాలో రవితేజ సరసన నటించిన సియా గౌతమ్ ని పరిచయం చేసింది కూడా పూరినే. కానీ నటిగా ఆమెకు చెప్పుకోదగ్గ బ్రేక్ రాలేదు. 'హార్ట్ ఎటాక్' తో ఆదాశర్మని.. 'లోఫర్' తో దిశా పటానీ ..'ఇజం'తో అదితి ఆర్యని.. 'జ్యోతిలక్ష్మి'తో ఏంజెలా క్రిసెంజీని.. 'పైసా వసూల్' తో ముస్కాన్ సేథీని.. 'మెహబూబా'తో నేహాశెట్టిని పరిచయం చేసింది పూరి సారే. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో తెరకెక్కిస్తోన్న 'లైగర్' తో బాలీవుడ్ వారసురాలు  అనన్య పాండే పరిచయం అవుతుంది. యువ నాయిక చుంకీపాండే...భావన పాండే లకు కుమార్తెగా సుపరిచితురాలే.