నా ఫుల్ సపోర్ట్ రాహుల్ - వరుణ్ కే అంటున్న పునర్నవి

Wed Oct 09 2019 16:21:14 GMT+0530 (IST)

Punarnavi Supports Rahul And Varun Sandesh in Bigg Boss 3 House

తెలుగు బిగ్ బాస్ 3 ఇంకా నాలుగు వారాలే మిగిలి ఉండడంతో హౌస్ లో ఎవరు ఉంటారో - ఎవరు వెళ్ళిపోతారో అన్న ఉత్కంఠ అటు కంటెస్టెంట్ లతో పాటు - ఇటు అభిమానుల్లో కూడా రోజు రోజుకీ ఎక్కువ అవుతుంది. లాస్ట్ వీక్ పునర్నవి ఎలిమినేట్ అవ్వడం చాలామందికి షాక్ ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన దగ్గర నుండి పునర్నవి - రాహుల్ - వరుణ్ - వితిక లతో చాలా స్నేహం గా ఉండేది. మధ్యలో ఎన్ని గొడవలు వచ్చినా సర్దుకుపోయి వాళ్ళతోనే ఉండేది. రాహుల్ తో అయితే నిజంగానే ప్రేమలో పడిందా అన్నంత క్లోజ్ గా మూవ్ అయ్యేది. కానీ పునర్నవి ఇంటి నుండి బయటకి వచ్చే ముందు రాహుల్ తో గొడవ పెట్టుకుని మాట్లాడడం మానేసింది. బయటికి వచ్చేటపుడు కూడా రాహుల్ తో ఫోటో దిగడానికి కూడా ఇష్టపడలేదు పునర్నవి.అలాంటి పునర్నవి ఇప్పుడు బయటకి వచ్చాక తన ఫ్రెండ్స్ అయిన రాహుల్ - వరుణ్ లకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది. తన ఫ్రెండ్స్ ఇద్దరిలో ఎవరో ఒకరిని టైటిల్ అందుకునేలా చేయాలని సోషల్ మీడియా లో పబ్లిసిటీ పీక్స్ లో చేస్తుంది. రాహుల్ అండ్ వరుణ్ కి సపోర్ట్ చేస్తూ ఆమె సోషల్ మీడియాలో వీడియో కూడా పెట్టింది. పునర్నవి హౌస్ లో ఉన్నపుడు చాలా అగ్రెస్సివ్ గా ఎవరైనా చిన్న మాట అంటే సీరియస్ గా తీసుకునేది. బయటకి వచ్చాక కామ్ గా తన ఫ్రెండ్స్ ని గెలిపించడానికి తాను చేయాల్సిన పబ్లిసిటీ చేస్తుంది.