రాహుల్ పై అలిగిన పున్ను

Wed Feb 26 2020 11:00:42 GMT+0530 (IST)

Punarnavi Reveals Relationship With Rahul Sipligunj

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా రాహుల్ సిప్లిగంజ్ ఇంకా పునర్నవి భూపాలంలు చాలా ఫేమస్ అయ్యారు. వీరిద్దరు అంతకు ముందే సెలబ్రెటీలు అయినా కూడా కొద్ది మందికి మాత్రమే తెలిసేవారు. కాని ఎప్పుడైతే బిగ్ బాస్ లో పులిహోర ఎపిసోడ్ జరిగిందో అప్పటి నుండి వీరిద్దరు సోషల్ మీడియాతో పాటు అన్ని మీడియాల్లో కూడా ప్రముఖం గా వార్తల్లో నిలిచారు. ఆ కారణం గా అంతా కూడా వీరి గురించి ప్రముఖంగా మాట్లాడుకుంటూ ఉండేవారు.వీరిద్దరు బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. రాహుల్ సీజన్ విన్నర్ గా నిలవడంలో పున్ను పాత్ర చాలా ఉందని అంతా నమ్ముతున్నారు. రాహుల్ కూడా పున్ను ప్రోత్సాహం నన్ను ముందుకు నడిపిందని చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ తర్వాత వీరిద్దరు పలు షోల్లో కనిపించారు. పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. తాజాగా పున్ను రాహుల్ పై అలిగినట్లుగా సన్నిహితుల వద్ద చెబుతుందట.

ఈమద్య కాలంలో రాహుల్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు.. కాల్ బ్యాక్ చేయడం లేదు. కనీసం మెసేజ్ లకు రిప్లై ఇవ్వడం లేదని చెప్పి వాపోయిందట. కొన్ని రోజులుగా రాహుల్ నుండి రెస్పాండ్ రాకపోవడంతో అతడికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. ప్రస్తుతం రాహుల్ చాలా బిజీగా ఉండటం వల్ల ఆయన పున్నుకు రిప్లై ఇవ్వలేక పోవచ్చు అంటూ నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు. అయినా ప్రేమ దోమ ఏమీ లేనప్పుడు ఎవరి కెరీర్ లు వారు చూసుకోక ఆయన ఫోన్ ఎత్తకుంటే వచ్చే నష్టం ఏంటీ అమ్మడు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.