ఫోటో స్టోరీ: పునర్నవి డర్టీ పిక్చర్!

Sun Feb 23 2020 12:14:49 GMT+0530 (IST)

Punarnavi Glamourous Pose

తెలుగులో ఘాటు భామలు ఎక్కువగా ఉండరని..  హాటు బ్యూటీలను ముంబై నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే అనే అభిప్రాయం ఉంది కానీ ఈమధ్య ఆ ఒపీనియన్ మార్చుకోవాల్సి వచ్చేలా ఉంది. ప్రస్తుతం మనం ఉండేది కలికాలం అని కొందరు పెద్దలు చెప్తూ ఉంటారు కానీ ఇది కలికాలం కాదు. హాటుకాలం.  అందుకే ప్రతి ఒక్క బ్యూటీ హాటుగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది.  పక్కింటమ్మాయి ఇమేజ్ ఉండే భామలు కూడా హాటు రాగం ఘాటు తాళంతో సోషల్ మీడియాకను షేక్ చేస్తున్నారు.  పునర్నవి భూపాలం కూడా ఈ హాటు ఉద్యమంలో భాగస్వామిగా మారింది.'ఉయ్యాల జంపాల' సినిమాతో టాలీవుడ్ కు నటిగా పరిచయం అయింది పునర్నవి.  తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది కానీ చెప్పుకోదగ్గ బ్రేక్ అయితే రాలేదు.  పోయినేడాది బిగ్ బాస్ 3 లో పాల్గొనడంతో పునర్నవి ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారింది.  బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పునర్నవి గ్లామర్ గేర్ వేసింది. హాటు ఫోటో షూట్లతో విరుచుకుపడుతోంది. తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో పూల డిజైన్ టాప్ ధరించింది. బ్లాక్ మిడ్డీ.. ఒక మ్యాచింగ్ బెల్ట్ తో  ఓ సెన్సువల్ పోజిచ్చింది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్..  లూజ్ హెయిర్.. పర్ఫెక్ట్ మేకప్ తో గ్లామరస్ గా కనిపిస్తోంది.  ఈ ఫోటోలో హైలైట్ ఏంటి? అనే ప్రశ్న అడిగితే ఎవరైనా టక్కున వీ నెక్ అనే చేప్తారు. అలా చెప్పలేదంటే.. మీరు సాయంత్రం పూట వేరే ఛానెల్ గతిలేక.. టీవీని వదల్లేక పందుల పెంపకం ప్రోగ్రాం చూసే కాలం వారని అర్థం చేసుకోవచ్చు..!

ఈ ఫోటోకు సూపర్ కామెంట్లు వచ్చాయి. "కత్తిలా ఉన్నావు".. "పున్నూ నువ్వో గ్లామర్ గన్ను" అంటూ కామెంట్లు పెట్టారు. ఒక చిరాకు నెటిజెన్ మాత్రం "ఛాన్సుల కోసమేనా ఈ సర్కస్?" అంటూ ఘాటుగా స్పందించాడు.  పునర్నవి ఇంత హాటుగా ఫోటో షూట్లు చేసేది.. అందాలు ఆరబోసేది  తప్పని సరిగా ఫిలిం మేకర్లను మెప్పించి సినిమా ఆఫర్లను సాధించేందుకే.  ఒకవేళ ఫిలిం మేకర్లు కనుక ఆఫర్లు ఇవ్వకపోతే ఇక బుల్లితెరతో సర్దుకుపోవాల్సిందే.