Begin typing your search above and press return to search.

ప‌బ్లిక్ డిమాండ్ : హిట్ 3లో కిల్ల‌ర్ గా త‌ను వుండాల్సిందే?

By:  Tupaki Desk   |   5 Dec 2022 10:31 AM GMT
ప‌బ్లిక్ డిమాండ్ : హిట్ 3లో కిల్ల‌ర్ గా త‌ను వుండాల్సిందే?
X
ఇన్వెస్టిగేటివ్ మ‌ర్డ‌ర్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన 'హిట్' మంచి విజ‌యాన్ని సాధించింది. హీరోగా విశ్వ‌క్ సేన్ లోని కొత్త కోణాన్ని ఆవిష్కిరంచి త‌న‌లో వున్న న‌టుడిని ప‌రిచ‌యం చేసింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్ రానున్నాయంటూ అప్ప‌ట్లోనే మేక‌ర్స్ అనౌన్స్ చేయ‌డంతో ఈ సీక్వెల్స్ పై ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి మొద‌లైంది. అనుకున్న‌ట్టుగానే 'హిట్'కు ఫ్రాంచైజీగా 'హిట్ ది సెకండ్ కేస్‌' ని తెర‌పైకి తీసుకొచ్చారు. అడివి శేష్ ప‌వ‌ర్ ఫుల్ కాప్ కెడీగా న‌టించిన ఈ మూవీ ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షోతో పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటూ బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 2న భారీ స్థాయిలో హీరో నేచుర‌ల్ స్టార్ నాని ఈ మూవీని రిలీజ్ చేశారు. అనుకున్న దానికి మించి విడుద‌లైన అన్ని ఏరియాల నుంచి సూప‌ర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంటూ రికార్డు స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌డుతోంది. ఫ‌స్ట్ డే ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.11 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన ఈ మూవీ రూ. 28. 1 కోట్ల గ్రాస్ ని ప్ర‌పంచ వ్యాప్తంగా రాబ‌ట్టి బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకుంటోంది.

'మేజ‌ర్‌' త‌రువాత ఈ స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన అడివి శేష్ మూవీగా 'హిట్ 2' స‌రికొత్త రికార్డుని సొంతం చేసుకోవ‌డంతో రానున్న రోజుల్లో ఈ మూవీ మ‌రింత‌గా వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం ఖాయం అని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. తాజాగా మేక‌ర్స్ విడుద‌ల చేసిన వ‌సూళ్ల‌ని బ‌ట్టి 'హిట్ 2' మండే టెస్ట్ ని విజ‌య‌వంతంగా పాస్ అయింద‌ని, బ్రేక్ ఈవెన్ ని కూడా సాధించింద‌ని చెబుతున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ ఎండింగ్ లో నేచుర‌ల్ స్టార్ నాని రూత్ లెస్ పోలీస్ ఆఫీస‌ర్ గా ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే.

నాని ఎంట్రీ ఇవ్వ‌డంతో 'హిట్ 3' నానిపై న‌డుస్తుంద‌ని క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన రెండు సినిమాల్లోనూ సీరియ‌ల్ కిల్ల‌ర్ పాత్ర‌లో జెంట్స్ క‌నిపించ‌డం.. అమ్మాయిల‌ని మ‌ర్డ‌ర్ లు చేయ‌డం చూపించారు. 'హిట్ 2'లో అయితే మ‌రింత క్రుయ‌ల్ గా సైకో కిల్ల‌ర్ ప్ర‌వ‌ర్తించ‌డం.. అమ్మాయిల‌ని ముక్క‌లు గా చేసి శ‌రీర భాగాల‌ని చూపించిన తీరు ఒళ్లు గ‌గుర్పొడిచేలా వుంది. అయితే ఈ సినిమాని చూసిన లేడీ ఫ్యాన్స్ చాలా మంది కొత్త డిమాండ్ ని తెర‌పైకి తీసుకొస్తున్నారు.

హిట్ 2 సినిమాతో మ‌ళ్లీ ఈ టీమ్ హిట్టు కొట్టేసింది. ఎప్పుడు త‌ప్పులు అమ్మాయిలు మాత్ర‌మే చేస్తారా?..అబ్బాయిలు చేయ‌రా?..సీరియ‌ల్ సైకో కిల్ల‌ర్స్ అబ్బాయిలే వుంటారా?.. అమ్మాయిలు వుండ‌రా?.. 'హిట్ 3' లో మాత్రం సీరియ‌ల్ కిల్ల‌ర్ గా అమ్మాయి మాత్ర‌మే వుండాలి. అబ్బాయిల్ని మ‌ర్డ‌ర్లు చేయాలి. అబ్బాయిలంద‌రు సైకోలు.. అమ్మాయిలంతా మంచి వాళ్లు.. హిట్ 3 లో అబ్బాయిలంతా చ‌నిపోవాలి.. అమ్మాయిలు వారిని దారుణంగా హ‌త్య చేయాలి. ఈ పాత్ర‌లో రంగ‌మ్మ‌త్త అన‌సూయ న‌టించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. మ‌రి హిట్ 3 కోసం నాని ప‌బ్లిక్ డిమాండ్ ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని అన‌సూయ‌తో సీరియ‌ల్ కిల్ల‌ర్ పాత్ర చేయిస్తారా? వ‌ఏచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.