ఫొటోటాక్ : మాల్దీవ్ ల నుండి మళ్లీ రెచ్చగొడుతోంది

Sun Jan 16 2022 11:07:40 GMT+0530 (IST)

Provoking again from the Maldives

హాట్ బ్యూటీ పూజా హెగ్డే మరోసారి మల్దీవ్ ఫొటోలు షేర్ చేసి రెచ్చగొడుతోంది. ఇప్పటికే పలు సార్లు మాల్దీవుల్లో బికినీతో సయ్యాటలాడుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చి ఆ ఫొటోలను షేర్ చేసిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఈసారి మరింత ఆకర్షణీయమైన ఫొటోలను షేర్ చేసి అభిమానులను మరియు నెటిజన్స్ ను కవ్విస్తుంది. నెట్టింట ఈ అమ్మడి తాజాగా ఫొటోలు ఎప్పటిలాగే వైరల్ అవుతున్నాయి. మాల్దీవ్ లకు ఈమద్య కాలంలో రెగ్యులర్ గా వెళ్తున్న పూజా హెగ్డే తాజాగా మళ్లీ స్నేహితులు మరియు సన్నిహితులతో కలిసి మాల్దీవులకు వెళ్లి హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తుంది.ఈ అమ్మడు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఖచ్చితంగా ఇలా హాలీడేస్ కు ఎంజాయ్ చేయడం కామన్ విషయం. నెట్టింట ఈ అమ్మడు షేర్ చేసే ప్రతి ఫొటో కూడా అభిమానులను మరియు ఫాలోవర్స్ ను మెప్పిస్తూనే ఉంటుంది. క్లీ వేజ్ షో చేసినా.. థైస్ ను చూపించింనా.. నడుము అందాలను చూపించినా ఇలా ప్రతి రూపంలో కూడా అమ్మడి అందం రెట్టింపు అన్నట్లుగా కనిపిస్తూనే ఉంటుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మాల్దీవుల్లో తాజాగా ఈ అమ్మడి అందాల ప్రదర్శణ ప్రస్తుతం ఆమె ఫాలోవర్స్ కు కనువింధు చేస్తుంది అనడంలో సందేహం లేదు.

పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే ఈమె నటించిన రాధే శ్యామ్ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఆ చిత్రం ఇప్పటికే సంక్రాంతి కానుకగా విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా వల్ల వాయిదా పడింది. సమ్మర్ లో ఖచ్చితంగా సినిమా ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున అంచనాలున్న రాధే శ్యామ్ సినిమాలో పూజా హెగ్డే పాత్ర కీలకంగా ఉంటుందంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా ఆకట్టుకుంటుంది వారు చెబుతున్నారు. ఇక పూజా హెగ్డే తమిళం మరియు హిందీలో కూడా వరుసగా సినిమాలు చేస్తోంది. పలు భాషల్లో సినిమా లు చేస్తూ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఈ అమ్మడు పేరు దక్కించుకుంది.