విషాదంః ప్రముఖ తెలుగు నిర్మాత మృతి

Tue May 04 2021 16:00:02 GMT+0530 (IST)

Prominent Telugu producer dies

సినీ పరిశ్రమలో విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనాతో.. కొందరు అనారోగ్యంతో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా.. ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు సతీమణి అనిత మృతిచెందారు. ఈమె కూడా పలు చిత్రాలను నిర్మించారు.అనిత అనారోగ్యంతో కన్నుమూశారు. వెంకటేశ్వరరావు-అనితల కుమార్తె స్వాతి గతంలో జూనియర్ ఎన్టీఆర్ బాల రామాయణంలో రావణాసురుడి పాత్ర పోషించారు. అనిత మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.దేశంలోని పలు సినీ పరిశ్రమల్లో గడిచిన నాలుగు రోజుల్లోనే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో నలుగురు దర్శకులు కాగా.. ఇద్దరు సీనియర్ నటులు ఉన్నారు. కొందరిని కరోనా బలిగొనగా.. మరికొందరు అనారోగ్యంతో కన్నుమూశారు.