Begin typing your search above and press return to search.

కండిషన్స్ అప్లై అంటున్న నిర్మాణ సంస్థలు...?

By:  Tupaki Desk   |   5 Aug 2020 6:15 AM GMT
కండిషన్స్ అప్లై అంటున్న నిర్మాణ సంస్థలు...?
X
కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితుల కారణంగా థియేటర్స్ లో గత నాలుగు నెలలుగా సినిమా రిలీజ్ కాలేదు. చిత్రీకరణ దశలో ఉన్న సినిమాలు అర్థాంతరంగా షూటింగ్స్ నిలుపుదల చేసుకోగా.. కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ పట్టాలెక్కలేదు. అయితే ఈ సమయంలో పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఇండస్ట్రీలోని క్రేజీ హీరోలతో ప్రాజెక్ట్స్ ఓకే చేపించుకునే పనిలో ఉన్నారు. ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు పరిస్థితులు చక్కబడి షూటింగ్స్ సజావుగా సాగుతాయనే ఉద్దేశ్యంతో వరుస పెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. డైరెక్టర్ మరియు ఇతర నటీనటులు సాంకేతిక నిపుణులు ఫైనలైజ్ అవకపోయినా ఫలానా హీరోతో మా ప్రాజెక్ట్ ఉంటుందని అధికారిక ప్రకటన ఇచ్చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇటీవల నిర్మాణ రంగంలోకి దిగిన ఏసియన్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ వారు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ స్థాపించి కుర్ర హీరోలతో వరుసగా సినిమాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే అక్కినేని నాగ చైతన్యతో 'లవ్ స్టోరీ' అనే సినిమా నిర్మిస్తున్న ఏసియన్ గ్రూప్ వారు టాలీవుడ్ యువ హీరోలు నాగ శౌర్య - శర్వానంద్ - నిఖిల్ లతో సినిమాలు నిర్మించబోతున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేసారు. ఈ క్రమంలో మరికొందరు హీరోలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇక అల్లు అరవింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ 2 వారు ఆల్రెడీ ఓ నాలుగు సినిమాలు లైన్ లో పెట్టారని తెలుస్తోంది. ఇప్పటికే అఖిల్ అక్కినేని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'.. నిఖిల్ '18 పేజెస్'.. కార్తికేయ 'చావు కబురు చల్లగా' సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని చర్చల దశలో ఉన్నాయని తెలుస్తోంది.

అయితే ఈ పెద్ద బ్యానర్స్ అన్నీ కుర్ర హీరోలతో చేసే అగ్రిమెంట్ లో కొన్ని కండిషన్స్ పెడుతున్నారట. అదేంటంటే తాము నిర్మించే సినిమాలు కుదిరితే థియేటర్స్ రిలీజ్ చేస్తాం లేకపోతే డిజిటల్ ఓటీటీ రిలీజ్ చేస్తాం అనే విధంగా క్లాజ్ పెడుతున్నారట. దీనికి ఒప్పుకున్న హీరోలతోనే మాత్రమే అగ్రిమెంట్ చేసుకుంటున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పుడు వరకు అధికారికంగా ప్రకటించిన ప్రాజెక్ట్స్ లో నటించే ప్రతి హీరో కూడా ఇలా ఓటీటీ రిలీజ్ కి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసినవారే. కాకపోతే ప్రస్తుతం ఇండస్ట్రీ క్రైసిస్ లో ఉండటం వల్ల నిర్మాతలను కాపాడుకోవాల్సిన బాధ్యత హీరోలపై కూడా ఉంది. ఇప్పటికే ఎక్కడి పెట్టుబడులు అక్కడే నిలిచిపోయి ఉన్నాయి. దీంతో ప్రొడ్యూసర్స్ నష్టాలను చవి చూడాల్సి వస్తోంది. అందుకే కుర్ర హీరోలు సైతం ఓటీటీ రిలీజ్ కి సరే అంటున్నారని తెలుస్తోంది.