Begin typing your search above and press return to search.

డైరెక్టర్ పనులకు బడా నిర్మాతలు అప్సెట్!

By:  Tupaki Desk   |   24 May 2020 12:30 AM GMT
డైరెక్టర్ పనులకు బడా నిర్మాతలు అప్సెట్!
X
ఆయనో కమర్షియల్ డైరెక్టర్. ఒక బడా నిర్మాత కాంపౌండ్ లో మొదట్లో వరసగా సినిమాలు చేశాడు. ఇంకో కమిట్ మెంట్ కూడా ఉంది కానీ ఆ ప్రాజెక్టు కుదరలేదు. మొదటి నుంచి నిర్మాత గారి మైండ్ సెట్.. ఈయనగారి యాటిట్యూడ్ కు పొంతన కుదిరేది కాదు కానీ ఈ సినిమా విషయం వచ్చేసరికి ఇక ఇద్దరివల్లా కాలేదు. దీంతో ఆ నిర్మాత ఈయన ప్రాజెక్టును డిలే చేయడంతో డైరెక్టర్ మరో నిర్మాతను చూసుకున్నాడు.

ఇదిలా ఉంటే రీ-ఎంట్రీ ఇస్తున్న ఓ పెద్ద స్టార్ హీరోతో కూడా ఒక సినిమా సెట్ చేసుకున్నాడు. దీని వెనక పెద్ద కథే నడిచిందట. ఈ సినిమాను నిర్మించబోతున్న ఓ బడా నిర్మాణ సంస్థతో మాట్లాడి హీరోగారికి రెమ్యూనరేషన్ ఎక్కువ ఇచ్చేలా సెట్ చేశాడట. అంతే కాదు.. ఆ ప్రాజెక్టు మరో దర్శకుడి చేతికి పోకుండా హీరో గారి చేత తన పేరును సిఫార్సు చేయించుకున్నాడట. ప్రాజెక్ట్ అయితే సెట్ అయింది కానీ ఈ విషయంలో దర్శకుడిపై నిర్మాతలు గుర్రుగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అటు హీరో గారి రెమ్యూనరేషన్ విషయంలో.. ఇటు డైరెక్టర్ ఎంపిక విషయంలో తమ మాట నెగ్గకుండా చేసినందుకు వారికి కోపం వచ్చిందట.

ఏదైతేనేం.. డైరెక్టర్ మాత్రం స్మార్ట్ గా ఇలా వరసగా ప్రాజెక్టులు సెట్ చేసుకుంటూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడట. ఈ డైరెక్టర్ వరసగా ఇలా ప్రాజెక్టులు సెట్ చేసుకోవడం మొదట్లో ఏ కాంపౌండ్ లో నుంచి బయటకు వచ్చాడో ఆ నిర్మాతకు మింగుడుపడడం లేదట.