Begin typing your search above and press return to search.

వేచి చూసే ధోరణిలో నిర్మాతలు..!

By:  Tupaki Desk   |   23 Jun 2021 3:30 PM GMT
వేచి చూసే ధోరణిలో నిర్మాతలు..!
X
కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో విడుదల తేదీలను ప్రకటించిన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. తెలుగు రాష్ట్రాలలో లాక్ డౌన్ కూడా పెట్టడంతో థియేటర్స్ మూతబడి పోయాయి. అయితే ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ముందుగానే తగ్గుముఖం పట్టింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతంగా జరుతుండటం.. కరోనా కేసులు గణనీయంగా తగ్గడంతో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసి సినిమా హాళ్లు తెరుచుకోడాని అనుమతి ఇచ్చింది.

ఏపీలో పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. రేపోమాపో థియేటర్లకు అనుమతి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే థియేటర్లు రీ ఓపెన్ చేసుకోడానికి ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చినా.. టాలీవుడ్ ఫిలిం మేకర్స్ సినిమాల విడుదల విషయంలో తొందరపడకుండా ముందుచూపుతో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. లాక్‌ డౌన్‌ కు ముందే రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు ఏవీ ఇప్పటి వరకు విడుదల తేదీలను ప్రకటించలేదు. దీనిని బట్టి చూస్తే ఇంకొన్నాళ్లు నిర్మాతలు వేచి చూసే ధోరణిలో ఉన్నారని అర్థం అవుతోంది.

ఏవైనా చిన్న సినిమాలు థియేటర్లకు వచ్చిన తర్వాత పరిస్థితిని విశ్లేషించి రిలీజ్ డేట్లను ప్రకటించాలని చూస్తున్నారట. అంతేకాదు ఏపీలో సవరించిన సినిమా టికెట్ ధరల గురించి కూడా తీవ్రంగా ఆలోచిస్తున్నారట. త్వరలో ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చలు జరిపే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద ఈసారి ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.