నిఖిల్ లాంటి హీరో ఉంటే ప్రొడ్యూసర్స్ డబుల్ హ్యాపీ

Tue Aug 16 2022 18:00:01 GMT+0530 (IST)

Producers are doubly happy if they have a hero like Nikhil

యంగ్ హీరో నిఖిల్ తాజాగా కార్తికేయ 2 సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. హీరోగా నిఖిల్ కు ఈ సినిమా మరో విజయంగా నిలిచింది.టాలీవుడ్ బాక్సాఫీస్ వద్దనే కాకుండా హిందీలో కూడా ఈ సినిమా వసూళ్లను దక్కించుకుంది. హిందీలో చాలా తక్కువ స్క్రీన్స్ లో విడుదల అయిన కార్తికేయ 2 రెండవ రోజే పెద్ద ఎత్తున స్క్రీన్స్ సంఖ్య పెరిగింది.

నిఖిల్ కార్తికేయ 2 సినిమా కోసం పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. షూటింగ్ పూర్తి అయిన తర్వాత ప్రమోషన్ కార్యక్రమాల్లో ఒకటి రెండు రోజులు పాల్గొని కనిపించకుండా వెళ్దాం అన్నట్లుగా కాకుండా  కార్తికేయ 2 ను ప్రాణం పెట్టి మరీ ప్రమోట్ చేశాడు. నిఖిల్ కష్టంకు ప్రతిఫలం అన్నట్లుగా కార్తికేయ 2 మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

కేవలం నిఖిల్ మాత్రమే కాకుండా యూనిట్ సభ్యులు అంతా కూడా కార్తికేయ 2 ను భారీ ఎత్తున కొత్త పద్ధతిలో ప్రచారం చేశారు. అందుకే సినిమా ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. అందుకే ఇప్పుడు సినిమా కు మంచి లాభాలు వస్తున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు బాక్సాఫీస్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కార్తికేయ 2 సినిమా యూనిట్ సభ్యులను ముఖ్యంగా హీరో నిఖిల్ ను తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అభినందించింది. కార్తికేయ 2 సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో బింబిసార.. సీతారామం ఇప్పుడు కార్తికేయ 2 విజయం సాధించింది.

సినిమా ప్రమోషన్ విషయంలో హీరో నిఖిల్ మరియు దర్శకుడు ఇంకా హీరోయిన్ కనబర్చిన శ్రద్ధ అభినందనీయం. భవిష్యత్తులో మిగతా హీరో మరియు హీరోయిన్స్ కూడా ప్రమోషన్ లో ఆ విధంగా సహకరించాలని ప్రత్యేక లేఖ లో నిర్మాతల మండలి పేర్కొంది. హీరో నిఖిల్ గారికి మరియు కార్తికేయ 2 సినిమా యూనిట్ సభ్యులకు నిర్మాతల మండలి శుభాకాంక్షలు.