Begin typing your search above and press return to search.

శ్రియతో ఆ రోజుల్లో అంటూ నిర్మాత షేర్‌ చేసిన హాట్‌ ఫొటో వైరల్‌

By:  Tupaki Desk   |   8 July 2020 3:00 PM GMT
శ్రియతో ఆ రోజుల్లో అంటూ నిర్మాత షేర్‌ చేసిన హాట్‌ ఫొటో వైరల్‌
X
టాలీవుడ్‌.. కోలీవుడ్‌.. బాలీవుడ్‌ ఇలా అన్ని భాషల్లో కూడా సినిమాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ శ్రియ. టాలీవుడ్‌ లో దాదాపు పుష్కర కాలం పాటు స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలిగిన ఈ అమ్మడు గత కొంత కాలంగా కాస్త డల్‌ అయ్యింది. సీనియర్‌ హీరోలకు జోడీగా మరియు కొన్ని వెబ్‌ సిరీస్‌ లల్లో ఈమె నటిస్తుంది. ప్రస్తుతం కరోనా సీజన్‌ కారణంగా ఈమె రష్యాలో భర్తతో కలిసి ఉంటుంది. గత నాలుగు నెలలుగా అక్కడే ఉన్నా కూడా ఈమె సోషల్‌ మీడియాలో అభిమానులకు చేరువగానే ఉంటుంది.

తాజాగా ఈమె ఫొటోను బాలీవుడ్‌ నిర్మాత తనూజ్‌ గర్గ్‌ షేర్‌ చేశాడు. అప్పట్లో తాగి ఎంజాయ్‌ చేసిన రాత్రి అంటూ ఈ ఫొటోను షేర్‌ చేశాడు. ఫొటోలో తనూజ్‌ మరియు శ్రియ చాలా క్లోజ్‌ గా ఉండటంతో పాటు శ్రియ చాలా హాట్‌ గా ఉంది. లండన్‌ లో ఒక పార్టీలో ఈ ఫొటోను తీసినట్లుగా షేర్‌ చేశాడు. ప్రస్తుతంఈ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. శ్రియను ఇలా చూసిన ఫ్యాన్స్‌ షాక్‌ అవుతున్నాయి. ఈ ఫొటోను చూసిన శ్రియ భర్త ఆండ్రీ కొచ్చివ్‌ ఎలా ఫీల్‌ అవుతున్నాడో అంటూ నెటిజన్స్‌ మీమ్స్‌ చేస్తున్నారు.