Begin typing your search above and press return to search.

దేవరకొండ పై పంచ్ వేసిన నిర్మాత?

By:  Tupaki Desk   |   28 Jan 2020 4:30 PM GMT
దేవరకొండ పై పంచ్ వేసిన నిర్మాత?
X
'పెళ్ళిచూపులు'.. 'మెంటల్ మదిలో' సినిమాలను నిర్మించిన రాజ్ కందుకూరి కి మంచి అభిరుచి గల నిర్మాత గా పేరుంది. తాజాగా ఆయన తన కుమారుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ 'చూసీ చూడంగానే' అనే సినిమాను నిర్మిచారు. శేష సింధు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరో మూడు రోజులలో విడుదల అవుతోంది. ఈసందర్భంగా ప్రమోషన కార్యక్రమాల్లో మాట్లాడుతూ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.

తెలుగులో లేడీ డైరెక్టర్లు తక్కువ అని.. ఒక లేడీ డైరెక్టర్ ను పరిచయం చేయాలనుకున్నామని రాజ్ కందుకూరి అన్నారు. శేష సింధు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాను నిర్మించామని తెలిపారు. ఈ సినిమా కథ ప్రకారం హీరో హీరోయిన్లు కొత్త వాళ్లను తీసుకోవాలి. దీంతో డైరెక్టర్ చాలా మందిని ఆడిషన్స్ చేసిందట. అదే సమయంలో శివ ఇండియా కు వచ్చాడని.. 12 రోజుల పాటు ఆడిషన్ చేసి మరీ తనను హీరోగా ఎంచుకున్నదని తెలిపారు. ఈ సినిమా రిలీజ్ కాకముందే శివకు హీరోగా మూడు అవకాశాలు వచ్చాయని తెలిపారు.

తమ బ్యానర్ లో తెరకెక్కే సినిమాల్లో అశ్లీలత.. డబుల్ మీనింగ్ డైలాగులు ఉండవని చెప్పారు. ఈమధ్య లిప్ లాక్స్ ఉంటేనే సినిమాలు హిట్ అవుతాయని చాలామంది అనుకుంటున్నారని.. అయితే లిప్ లాక్ సీన్స్ తో విజయం రాదని కుండబద్దలు కొట్టారు. రాజ్ కందుకూరి కామెంట్లు చూస్తుంటే విజయ్ దేవరకొండ పై వేసిన సెటైర్లు లాగా ఉన్నాయని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాజ్ కందుకూరి నిర్మించిన 'పెళ్ళిచూపులు' సోలో హీరోగా విజయ్ దేవరకొండకు ఫస్ట్ సినిమా. అయితే ఆ సినిమా తర్వాత ప్రతి సినిమాలో విజయ్ లిప్పులాకుల మోత మోగిస్తున్నాడు. కథకు అవసరం ఉన్నా లేకపోయినా లిప్పు లాకులు ఉండాలని విజయ్ డిమాండ్ చేస్తున్నట్టుగా కూడా ఒక టాక్ ఉంది. ఇంతకీ రాజ్ కందుకూరి జనరల్ గా కామెంట్ చేశారా.. లేదా రౌడీపై సెటైర్ వేశారా?