Begin typing your search above and press return to search.

హీరోయిన్ హోటల్ బిల్స్: ఆ నిర్మాతదే తప్పు అని అంటున్నారే!

By:  Tupaki Desk   |   24 Feb 2020 2:30 PM GMT
హీరోయిన్ హోటల్ బిల్స్: ఆ నిర్మాతదే తప్పు అని అంటున్నారే!
X
ఈమధ్య ఒక యువ హీరో సినిమా రిలీజ్ అయింది. సొంత బ్యానర్లోనే తెరకెక్కిన సినిమా. సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నారు కానీ నష్టాలు మిగిల్చిందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ హోటల్ బిల్లుల వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఒక ప్రమోషన్ ఇంటర్వ్యూకు హీరోయిన్ రాలేనని చెప్పడంతో అలా అయితే హోటల్ బిల్స్ కట్టము అంటూ నిర్మాత హీరోయిన్ కు వార్నింగ్ ఇచ్చారట. అయితే హీరోయిన్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా చెప్పాపెట్టకుండా హోటల్ రూమ్ ఖాళీ చేసి వెళ్ళింది. దీంతో హోటల్ వారు నిర్మాతను ఒత్తిడి చేయడంతో ఆయన కట్టాల్సి వచ్చిందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే నిర్మాతకు సంబంధించిన వారు మాత్రం తప్పంతా హీరోయిన్ దేనని తమ తప్పేమీ లేదని కొత్తగా ప్రచారం మొదలు పెట్టారు. అయితే ఈ విషయం గురించి తెలిసిన వారు మాత్రం తప్పు నిర్మాతదేనని తేల్చేస్తున్నారు.

హీరోయిన్ హోటల్ బిల్స్ కట్టాల్సిన బాధ్యత ఎప్పుడూ నిర్మాతదే. సినిమా స్థాయిని బట్టి.. హీరోయిన్ రేంజ్ ని బట్టి షూటింగ్ జరిగే సమయంలో ఏదో ఒక హోటల్ లో వసతి కల్పిస్తారు. ఆ హోటల్ బిల్స్ క్లియర్ చేయడం నిర్మాత బాధ్యతే. ఇది టాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయం. అయితే ఈ నిర్మాతమాత్రం అలా చెయ్యలేదట. దీంతో సమస్య వచ్చింది. ఇదే కాకుండా హీరోయిన్ పై నెగెటివ్ ప్రచారం కూడా మొదలు పెట్టారట. ముందు చెప్పినదానికంటే సినిమాలో హీరోయిన్ స్క్రీన్ టైమ్ తగ్గించడం.. హీరోయిన్ యాటిట్యూడ్ సరిగా లేదని తెలిసిన వారందరికీ చెప్పి బ్యాడ్ చేశారట. వీటన్నిటికి తోడు బిల్స్ కట్టకుండా విసిగించారట.

ఇప్పుడేమో హీరోయిన్ తమపై బురద చల్లుతోందని రివర్స్ లో ప్రచారం మొదలు పెట్టారట. అంతే కాకుండా హీరోయిన్ బిల్స్ మొత్తం క్లియర్ చేసినట్టు హీరోయిన్ మేనేజర్ స్పష్టం చేశాడని కూడా ప్రచారం చేస్తున్నారట. ఇది హీరోయిన్ కు షాకింగ్ గా మారిందని అంటున్నారు. సినిమా అనుకున్నంతగా ఆడకపోవడంతో హోటల్ బిల్స్ కట్టలేక ఇబ్బంది పడ్డారని.. అది బయటకు తెలిస్తే పరువు పోతుందని హీరోయిన్ పైకి నెపం వేసినట్టుగా చెప్తున్నారు. నిజానికి ఆ హీరోయిన్ కు ఇది మొదటి సినిమా ఏమీ కాదు. ఇప్పటికే పది సినిమాల్లో నటించింది. ఇప్పటివరకూ ఆమెతో ఎవరికీ సమస్య రానప్పుడు ఈ నిర్మాతతోనే ఎందుకు వచ్చింది అలోచించాలి అని హీరోయిన్ సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు.. ఇదే ప్రొడక్షన్లో గతంలో పని చేసిన డైరెక్టర్ పై కూడా ఈ నిర్మాత బురద చల్లిన విషయం గుర్తు చేస్తున్నారు.