దిల్ రాజు 'సెల్ఫిష్'.. హిట్టు కొట్టాల్సిందే!

Sun Jul 03 2022 22:00:01 GMT+0530 (IST)

Producer Dil Raju

దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాలు ఇటీవల కాలంలో అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నాయి. రాబోయే రోజుల్లో అయితే ఈ నిర్మాత నుంచి అతి పెద్ద సినిమాలు అలాగే మరికొన్ని మీడియా బడ్జెట్ సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. ఇక అందులో ప్రత్యేకంగా దిల్ రాజు ఎంతో ఆసక్తితో నిర్మిస్తున్న చిత్రం సెల్ఫిష్. తన సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు కాశీ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాతో అన్న కొడుకు ఎలాగైనా సక్సెస్ అవ్వాలని దిల్ రాజు ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇదివరకే ఆశిష్ రెడ్డి తో దిల్ రాజు రౌడీ బాయ్స్ అనే సినిమా నిర్మించాడు. అయితే నిజానికి ఆ సినిమాపై దర్శకుడిపై అలాగే తన టీమ్ ను నమ్మి పెద్దగా ఫోకస్ చేయలేకపోయాడట. అ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెట్టిన పెట్టుబడికి ఏమాత్రం లాభాలను అందించకపోవడంతో ఇప్పుడు సెల్ఫీష్ సినిమాపై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

బడ్జెట్ విషయం నుంచి కంటెంట్ మేకింగ్ వరకు ఎక్కడ కూడా పొరపాట్లు జరగకుండా దిల్ రాజు జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అంతేకాకుండా ఈ సినిమాకు డైరెక్టర్ సుకుమార్ ను కూడా భాగం చేశాడు. అతను ప్రత్యేకంగా ఈ సినిమాకు కొంత స్క్రిప్ట్ వర్క్ కూడా చేసినట్లుగా తెలుస్తోంది. ఎలాగైనా ఈ సినిమాతో ఆశిష్ రెడ్డిని హీరోగా నిలబెట్టాలని దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నాడు.

మరి ఈ సినిమాతో ఆశిష్జ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. అలాగే మరొకవైపు దిల్ రాజు రామ్ చరణ్ శంకర్ లతో అతిపెద్ద బిగ్ బడ్జెట్ సినిమాను తెరపైకి తీసుకు రాబోతున్నాడు. ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికిపైగా పూర్తయింది. ఇక వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం ఆ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. ఇక దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న నాగచైతన్య థాంక్యూ సినిమా మరికొన్ని రోజులలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.