Begin typing your search above and press return to search.

ఆ సినిమాను పవన్‌ లేదా ఎన్టీఆర్ చేసి ఉంటే చరిత్ర అయ్యేది

By:  Tupaki Desk   |   10 Dec 2022 5:57 AM GMT
ఆ సినిమాను పవన్‌ లేదా ఎన్టీఆర్ చేసి ఉంటే చరిత్ర అయ్యేది
X
కొన్ని సినిమాలు కొందరు స్టార్స్ కి మాత్రమే సెట్‌ అవుతాయి... కొన్ని కథలు ఏ హీరో చేసినా కూడా భలే ఉందే అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. తాజాగా నిర్మాత సి కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన నిర్మించిన గాడ్సే సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. సత్యదేవ్‌ నటించిన ఆ సినిమా ఓటీటీ లో మాత్రం మంచి సక్సెస్ టాక్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే.

ఆ సినిమా ఫలితం గురించి నిర్మాత సి కళ్యాణ్ స్పందించాడు. గాడ్సే సినిమా కథ ఒక అద్భుతం. ఆ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన తీరు కూడా ప్రతి ఒక్కరు ప్రశంసించారు.

కానీ స్టార్‌ కాస్ట్‌ లేక పోవడం వల్ల మాత్రమే సినిమాను జనాలు థియేటర్ల ద్వారా వచ్చిన సమయంలో చూసేందుకు ఆసక్తి చూపించలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

సత్యదేవ్ మంచి నటుడు అయినా కూడా స్టార్‌ డం లేని హీరో కనుక సినిమా కు జనాలు క్యూ కట్టేలుదు అన్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. గాడ్సే వంటి కథను పవన్‌ కళ్యాణ్‌ లేదా ఎన్టీఆర్ వంటి స్టార్‌ హీరో చేసి ఉంటే.. వారి నటనతో సినిమా స్థాయిని మరో లెవల్ కు తీసుకు వెళ్లే వారు అన్నట్లుగా సి కళ్యాణ్‌ వ్యాఖ్యలు చేశాడు.

గాడ్సే సినిమాను స్టార్‌ హీరోలు చేసి ఉంటే కచ్చితంగా చరిత్ర అయ్యేది అన్నట్లుగా సి కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. సోషల్‌ మీడియాలో గాడ్సే గురించి ప్రముఖంగా చర్చ జరిగింది.. ట్రైలర్ వచ్చిన సమయంలో అద్భుతం అన్నట్లుగా కామెంట్స్‌ వచ్చాయి. కానీ సినిమా కు కలెక్షన్స్ మాత్రం ఎక్కువ రాలేదు.

నిరుద్యోగ సమస్య నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ప్రతి ఒక్క సామాన్య మద్యతరగతి వారికి కనెక్ట్‌ అయ్యే విధంగా ఈ కథ ఉంటుంది. అందుకే ఎన్టీఆర్ లేదా పవన్‌ కళ్యాణ్ వంటి స్టార్‌ చేసి ఉంటే కచ్చితంగా జనాలకు ఎక్కువగా రీచ్‌ అవ్వడంతో పాటు జనాల్లో ఆలోచన కలిగేది అనేది సి కళ్యాణ్ అభిప్రాయం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.