అమ్మడి నడుము వయ్యారాల విల్లు..!!

Sat Jul 04 2020 06:00:05 GMT+0530 (IST)

Priyanka Jawalkar Latest pic goes viral

కళ్లుచెదిరే అందంగా ఉన్నా తెలుగు అమ్మాయిలకు ఆఫర్లు రావడం కష్టం అనేది మరోసారి నిరూపించిన బ్యూటీ ప్రియాంక జవాల్కర్. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు చెందిన ఈ భామ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'ట్యాక్సీవాలా' సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. చూడటానికి ముంబై సరుకు అనిపించినా.. తెలుగే అనేసరికి అందరూ మంత్రముగ్దులు అయిపోయారు. ఫస్ట్ సినిమాతో సక్సెస్ అందుకున్నా ప్రియాంకకి ఆఫర్లు మాత్రం పెద్దగా రావడం లేదు. టాక్సీవాలాలో తన అమాయకత్వంతో కూడిన నటనతో క్యూట్ హావభావాలతో కుర్రకారు మనసు దోచుకున్నా అమ్మడికి ఎందుకు అవకాశాలు రాట్లేదు అనేది జవాబు తెలియని ప్రశ్న. తాజాగా సోషల్ మీడియాలో అమ్మడి ఫోటో తెగ వైరల్ అవుతోంది.బ్లాక్ సారీలో ప్రియాంక జవాల్కర్ నడుము అందాలు చూపిస్తూ హొయలు పోతున్న ఈ ఫొటో చూసిన తర్వాత అయినా దర్శక నిర్మాతలకు మనసు కరిగి ఛాన్స్ ఇస్తారేమో చూడాలి అంటున్నారు అభిమానులు. ఇటీవల ఒకటి రెండు సినిమాల చర్చల దశలో ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. మరో రెండు మూడు సినిమాల్లో ఛాన్స్ వస్తే ఈ అమ్మడు ఇండస్ట్రీని తన అందాలతో దున్నేయడం ఖాయమే అనిపిస్తుంది. బ్లాక్ చీరలో తెల్లని మేనిఛాయతో ప్రియాంక దేవతలా మెరిసిపోతుంది. మత్తెక్కించే నడుము.. అమ్మడి ఓర చూపులు అలా యువత హృదయాలలో కుంపటి రేపుతున్నాయి. 'లాస్ట్ వన్' అంటూ కాప్షన్ పెట్టి.. అవును నీలాంటి పీస్ ఒక్కటే ఉంటుందని అనిపిస్తుంది. చెక్కిన శిల్పంలా అమ్మడి అందాల ప్రదర్శన నిజంగానే మైమరపిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. అన్నట్టు ఈ భామ 'కలవరం ఆయె' సినిమాలో కూడా మెరిసిందట. చూడాలి మరి త్వరలో ఏదైనా సినిమాతో స్టార్ గా ఎదుగుతుందేమో..!