Begin typing your search above and press return to search.

హాట్ గేర్ వేసిన టాక్సీవాలా భామ

By:  Tupaki Desk   |   10 Jun 2019 7:09 AM GMT
హాట్ గేర్ వేసిన టాక్సీవాలా భామ
X
ఒక హిట్ సినిమాలో నటిస్తే హీరోయిన్ కు అవకాశాల వాన కురుస్తుందని అనుకుంటారు కానీ అందరికీ అలా ఏం జరగదు. ఉదాహరణకు అనంతపూర్ అందాల దేవత ప్రియాంక జవాల్కర్ ను తీసుకోండి. ఈ భామ ఇప్పటివరకూ నటించింది రెండే సినిమాలు. ఒకటి 'కలవరం ఆయె' కాగా మరొకటి 'టాక్సీవాలా'. మొదటి సినిమా సంగతి పక్కన పెట్టేస్తే రెండో సినిమా విజయ్ దేవరకొండ సినిమా కావడం.. బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించడంతో ప్రియాంకకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే సభలకు వచ్చిన జనాలందరూ ఓట్లు వేస్తారని గ్యారెంటీ లేనట్టుగా ప్రియాంకకు ఆ టాక్సీవాలా గుర్తింపు పెద్దగా ఆఫర్లను తీసుకురావడం లేదు.

దీంతో కాస్త అప్సెట్ అయి గ్లామర్ ఆయుధాన్ని సోషల్ మీడియాలోని నెటిజనుల మీద ప్రయోగించింది. ఇప్పటికే కొన్ని హాట్ ఫోటో షూట్స్ లో పాల్గొన్న ఈ ప్రియాంక తాజాగా మరోసారి కెమెరాలకు హాటు పోజిచ్చింది. ఆ ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసి "మీరు నన్ను మర్చిపోయారా?" అనే క్యాప్షన్ ఇచ్చింది. ఈ క్యాప్షన్ తో పాటు గుర్రుగా చూస్తున్నట్టు ఒక ఎమోజి.. పకాపకా నవ్వుతున్నట్టుగా మరో ఎమోజి పెట్టింది. ఇంతకీ ప్రియాంక 'మర్చిపోయారా' అని అడిగింది ఎవరినో? ప్రేక్షకులనా లేక హాట్ షోలకు రెడీ అని ఎన్నో హింట్స్ ఇస్తున్నా అసలేమాత్రం పట్టించుకోని ఫిలిం మేకర్లనా?

ఏదేమైనా ఫోటో మాత్రం అదిరిపోయింది. నిజంగా డ్రెస్ వేసుకుందో లేదో తెలియదు కానీ ఫోటో చూస్తే వేసుకున్నట్టు ఏమాత్రం అనిపించడం లేదు. రెడ్ కలర్ లిప్ స్టిక్.. లూజ్ హెయిర్.. మత్తుగా నవ్వుతూ మహా సెక్సీగా ఉంది. ఈ ఫోటోకు నెటిజనులు సూపర్ కామెంట్లు పెట్టారు. మీరు నన్ను మర్చిపోయారా? అని ప్రియాంక క్యాప్షన్ ఇచ్చింది కదా.. దీనికి సమాధానంగా ఒక నెటిజన్ "నో డియర్.. నువ్వే మమ్మల్ని మర్చిపోయావు" అన్నారు. మరొకరు "వదిలేయాలన్న అలోచన లేదు. గుర్తు పెట్టుకునేంత రిలేషన్ అంతకన్నా లేదు" అన్నారు. ఇంకొకరు "మ్యాగ్నెటిక్ ఐస్" అన్నారు.