ప్రియాంక చోప్రా ప్రెగ్నెంట్.. అలా కనిపించడంతో కన్పాం చేశారు!

Tue Feb 23 2021 15:26:43 GMT+0530 (IST)

Priyanka Chopra pregnant

ఇటీవల బాలీవుడ్ తారలు ఇద్దరు పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు. వారిలో ఒకరు అనుష్క శర్మ మరొకరు కరీనా కపూర్. అనుష్క శర్మ జనవరి 11న ఆడబిడ్డను ప్రసవించగా.. కరీనా కపూర్ ఫిబ్రవరి 21న మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్తలు బాలీవుడ్లో కొన్నిరోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. తాజాగా మరో న్యూస్ తెరపైకి వచ్చింది. బాలీవుడ్ కమ్ హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా తల్లి కాబోతోందనే వార్తలు వైరల్ అయ్యాయి.ప్రియాంక చోప్రా అమెరికన్ గాయకుడు నిక్ జోనస్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. లేటెస్ట్ గా ఆమె లూజ్ గా ఉండే స్వెటర్ వేసుకొని మీడియా కంట పడ్డారు. అంతేకాదు.. ఆ ఫొటోలో ఆమె పొట్టభాగం కాస్త ఉబ్బెత్తుగా కనిపించింది. దీంతో.. ప్రియాంక ప్రెగ్నెంట్ అనే వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ వార్తలు అంతటా విస్తరించడం.. కంటిన్యూ అవుతుండడంతో ప్రియాంక పీఆర్ వర్గాలకు చెందిన వారు స్పందించారు. ఆ ఫొటోలో ప్రియాంక తన పెంపుడు జంతువులతో లండన్ వీధుల్లో వెళ్తున్నారని చెప్పారు. అక్కడి వాతావరణం దృష్ట్యా ఆ డ్రెస్ వేసుకున్నారని అంతే తప్ప.. తానున ప్రెగ్నెంట్ కాదు అని క్లారిటీ ఇచ్చారు.