తిరిగి వెళ్లకుంటే గ్యాంగ్ రేప్ చేస్తామంటూ హీరోయిన్ కు బెదిరింపులు

Wed Feb 24 2021 09:00:01 GMT+0530 (IST)

Priyanka Chopra Talking About Her Career

గ్లోబల్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న ప్రియాంక చోప్రా యూఎస్ కుర్రాడు నిక్ ను పెళ్లి చేసుకుని ఎక్కువగా అక్కడే ఉంటుంది. షూటింగ్ లు ఉన్న సమయంలో లేదా ముఖ్య సందర్బాల్లో ఇండియాకు ప్రియాంక నిక్ తో కలిసి వస్తుంది. ఒక వైపు ఇండియన్ సినిమాలు చేస్తూ వస్తున్న ఈ అమ్మడు మరో వైపు హాలీవుడ్ సినిమాలు మరియు వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా ఉంది. హాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ప్రియాంక చోప్రాపై మొదటి నుండి అక్కడి వారు జాతి అహంకార వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి ఆమెపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడం జరిగింది.ప్రియాంక చోప్రా తాజాగా తన జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలకు సంబంధించిన ఒక పుస్తకంను తీసుకు వచ్చింది. అందులో ఆమె మాట్లాడుతూ అమెరికన్స్ తనపై చేసిన వ్యాఖ్యలను వివరించింది. ఒకానొక సమయంలో తనను వెనక్కు వెళ్లి పోవాలంటూ హెచ్చరించారు. నీ దేశం వెళ్లి పోకుంటే గ్యాంగ్ రేప్ కు పాల్పడుతామంటూ హెచ్చరించారు. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా నాపై విమర్శల దాడి చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు అంటూ పీసీ చెప్పుకొచ్చింది. పీసీ జీవిత విశేషాలతో ఉన్న అన్ ఫినీష్డ్ పుస్తకం అమెరికాలో ప్రస్తుతం బెస్ట్ సెల్లర్ గా నిలిచింది.