ఫోటో స్టొరీ: ప్రియాంక ఫ్యాషన్ సెన్స్ హుష్ కాకీ!

Sat Sep 21 2019 10:11:25 GMT+0530 (IST)

Priyanka Chopra Spotted At Mumbai Airport

బాలీవుడ్ లో కొంతకాలం క్రితం టాప్ హీరోయిన్.. ఇప్పుడు హాలీవుడ్ హీరోయిన్.. అందరూ గ్లోబల్ సుందరిగా పిలుచుకునే భామ ప్రియాంక చోప్రా.  పోయినేడాది తన అమెరికన్ బాయ్ ఫ్రెండ్ నిక్ జోనాస్ ను వివాహమాడి ప్రియాంక చోప్రా జోనాస్ గా మారింది.  ప్రియాంక మాజీ మిస్ వరల్డ్.  ఒక ఫ్యాషన్ ఐకాన్. అందులో అణువంత కూడా సందేహం లేదు. కానీ ఈమధ్య ప్రియాంక దుస్తుల ఎంపిక.. ఫ్యాషన్ చాలా ఎబ్బెట్టుగా ఉంటోందని ఫ్యాషన్ ప్రియులు ఓపెన్ గానే విమర్శలు చేస్తున్నారు.కొన్ని నెలల క్రితం మెట్ గాలా ఈవెంట్ లో ప్రియాంక చోప్రా దుస్తులు 'సందర్భానికి తగ్గట్టు' ఉన్నాయని అదే అద్భుతమైన డ్రెస్ అని 'మెట్-ఫ్యాషన్ ప్రియులు' చంకలు గుద్దుకున్నారు.  కానీ సాధారణ ఫ్యాషన్ ప్రియులకు మాత్రం ఆ ఫ్యాషన్ తో పిచ్చెక్కింది.  ఇక మరో సందర్భంలో చీర-బ్లౌజు అంటూ ఒక చిత్రాతి చిత్రమైన డ్రెస్ ధరించి ఫ్యాషన్ ప్రియుల హేళనకు గురయింది.  ఇలాంటి సందర్భాలు చాలానే జరిగాయి.  తాజాగా మరోసారి ప్రియాంక అందరికీ తన ఫ్యాషన్ సెన్స్ తో షాక్ ఇచ్చింది.

ప్రియాంక రీసెంట్ గా ఇండియాకు వచ్చింది.  ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పారు.  ప్రియాంక ఒక శాటిన్ క్లాత్ ప్రింటెడ్ కలర్స్ షర్టు.. గ్రే కలర్ షార్ట్ ధరించి స్టైల్ గా నడుచుకుంటూ వచ్చింది.  లిప్స్ కు రెడ్ కలర్.. చేతికి వాచ్..కాళ్ళకు బ్లాక్ షూతో కనిపించింది. ఈ ఫోటోలలో ప్రియాంకను చూస్తే ఆమె ఒక బాలీవుడ్ హీరోయిన్ అని ఎవరూ అనుకోరు.  దీంతో నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.  ప్రియాంక లైఫ్ లో ఇది వరస్ట్ డ్రెస్సింగ్ అంటూ చెత్తకామెంట్లతో విరుచుకుపడ్డారు.  ఏమాటకామాటే చెప్పుకోవాలి.  ప్రియాంక డ్రెస్ డిజైనర్ ఎవరో కాని ఆ వ్యక్తికి ఎర్రగా కాల్చి ఒంటిపై నాలుగు కీలక ప్రదేశాలలో గట్టిగా వాతలు పెడితే కానీ ప్రియాంకకు ఈ విమర్శలు తప్పేలా లేవు!