పీసీ ఫ్యాషన్ పిచ్చి పీక్స్ .. ఏడాదయ్యింది అందుకని!

Wed May 12 2021 22:00:01 GMT+0530 (IST)

Priyanka Chopra Latest Photo

ఫ్యాషన్ పిచ్చి పీక్స్ కి చేరితే ఎలా ఉంటుందో ఇదిగో ఇక్కడ అమెరికా కోడలు ప్రియాంక చోప్రాను చూసి చెప్పేయొచ్చు. కేన్స్ .. ఆస్కార్.. గ్రామీ .. గోల్డెన్ గ్లోబ్.. మెట్ గాలా.. వేదిక ఏదైనా అక్కడ భారతీయ మిస్ అందచందాల ముందు ఇతర ప్రపంచం నివ్వెర పోవాల్సిందే. హాలీవుడ్ లో నటించాక నిక్ జోనాస్ ని పెళ్లాడాక పీసీ బ్రాండ్ వ్యాల్యూ అమాంతం ఇంటర్నేషనల్ రేంజుకు చేరింది.ఇక ఇప్పట్లో లోకల్ మార్కెట్ గురించి పీసీకి ఎలాంటి ఆలోచనా లేదు. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్ లతోనే కెరీర్ పరంగా బిజీగా ఉంది. మరోవైపు ఫ్యాషన్ ప్రపంచంలోనూ రారాణిగా వెలిగిపోతోంది.

నిక్ జోనాస్ తో కలిసి పీసీ ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఫోటోని షేర్ చేసింది. దేవత కాళికా మాతను వీపు భాగంలో ముద్రించిన జాకెట్ తో ప్రియాంక చోప్రా కనిపించింది. నిజానికి ఇది త్రోబ్యాక్ ఫోటో. మరోసారి ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది.

 నిక్ జోనాస్ గత ఏడాది ఫిబ్రవరిలో తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో ఇదే చిత్రాన్ని పంచుకున్నారు. మార్చి 2019 లో విడుదలైన వారి పాట సక్కర్ విడుదలకు ముందే నిక్ తన బృందం జోనాస్ బ్రదర్స్ పునఃకలయిక ఏడాది సంబరాల్ని జరుపుకున్నారు. నిక్ జోనాస్- జో జోనాస్ -కెవిన్ జోనాస్ వారి భార్యలతో కలిసి ప్రియాంక చోప్రా- సోఫీ టర్నర్ -డేనియల్ ఈ సందర్భంగా పార్టీలో మునిగి తేలారు.  నాటి అరుదైన ఈవెంట్ ఫోటో ఇది.

కెరీర్ విషయానికొస్తే.. ప్రియాంక చోప్రా చివరిసారిగా ఈ సంవత్సరం ప్రారంభంలో ది వైట్ టైగర్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం మ్యాట్రిక్స్4- టెక్స్ట్ ఫర్ యు వంటి సినిమాల్లో నటిస్తోంది. వస్తున్నాయి. ప్రియాంక చోప్రా 2018 లో అమెరికన్ గాయకుడు నటుడు నిక్ జోనాస్ ను వివాహం చేసుకున్నారు.