బటన్ లెస్ ఫోజులో కిరాక్ పుట్టించిన కోడలు

Sat Jan 23 2021 09:00:01 GMT+0530 (IST)

Priyanka Chopra Latest Photo

అమెరికా కోడలు ప్రియాంక చోప్రా లైఫ్ బెస్ట్ ఫేజ్ ని ఎంజాయ్ చేస్తోంది. అమెరికన్ సింగర్ కం నటుడు నిక్ జోనాస్ ని పెళ్లాడాక పీసీ ఆనందనికి అవధులే లేవు. ప్రస్తుతం అమెరికాలోనే నివాసం ఉంటూ ముంబైకి వచ్చి వెళుతోంది. ఓవైపు హాలీవుడ్ లో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ సినిమాల్లో  తనకు నచ్చిన వాటిని సెలెక్టివ్ గా చేస్తోంది. అలాగే నిర్మాతగానూ ఓటీటీ సినిమాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.మరోవైపు తన వ్యక్తి గత జీవితంలో ప్రతిదీ ఇన్ స్టా వేదికగా రివీల్ చేస్తున్న పీసీ తాజాగా అదిరిపోయే ఫోటోషూట్ ని షేర్ చేసింది. బ్లాక్ టాప్ లో టాప్ లేపేసింది. అసలే బటన్ లెస్ ఫోజులో పీసీ టూమచ్ హాట్ గా కనిపిస్తోంది.

దీనికి హాట్ నెస్ ఓవర్ లోడెడ్! అంటూ అభిమానులు వ్యాఖ్యలతో ఫైర్ ఈమోజీల్ని షేర్ చేస్తున్నారు. అంతర్జాలాన్ని షేక్ చేస్తున్న పీసీ లేటెస్ట్ ఫోటోషూట్ నుంచి వేడెక్కిపోయే ఫోటో ఇది.  ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఓ అమెరికన్ వెబ్ సిరీస్ లో విలన్ పాత్రలో నటిస్తోంది. అలాగే పలు హాలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. ఇటు బాలీవుడ్ లోనూ నిర్మాతగా వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ భారీగా ఆర్జనకు ప్లాన్ చేసింది.