Begin typing your search above and press return to search.

నిక్ తో ప్రియాంక చోప్రా బ్రేక‌ప్.. ఇదీ సంగ‌తి!

By:  Tupaki Desk   |   14 Jan 2022 5:03 PM GMT
నిక్ తో ప్రియాంక చోప్రా బ్రేక‌ప్.. ఇదీ సంగ‌తి!
X
ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ జంట అన్యోన్య‌త ప్ర‌తిసారీ హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ జంట వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతోంది. వృత్తి ప‌రంగానూ అమెరికాలో స్థిర‌ప‌డిన ఈ జంట మ‌ధ్య‌లోకి మూడ‌వ వ్య‌క్తిని సైతం తీసుకురావ‌డానికి ఈ జంట‌పై దుష్ప్ర‌చారం చేసేందుకు అక్క‌డ స్థానిక మీడియా సంస్థ‌లు ప్లాన్ చేయ‌డం తెలిసిందే. పెళ్ల‌యిన నెల‌ల్లోనే ఓ ప్ర‌ముఖ మీడియా ప్రియానిక్ జంట బ్రేక‌ప్! అంటూ సంచ‌ల‌న క‌థ‌నం వెలువ‌రించింది. కానీ దానికి ప్రియానిక్ ధీటైన స‌మాధానం ఇచ్చారు.

వారి అన్యోన్య‌త‌లో ఎలాంటి డోఖా లేద‌ని ఇప్ప‌టికే నిరూప‌ణ అయ్యింది. ప్రియానిక్ హ్యాపీ లైఫ్ ఆద‌ర్శ సంసారం గురించి తెలిసిన‌దే. ఇటీవ‌లే పిల్ల‌లంటే త‌న‌కెంత ఇష్ట‌మో పీసి తెలిపింది. ఇక పండుగ‌లు వ‌చ్చాయంటే ఈ జంట చేసే హ‌డావుడి గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ముఖ్యంగా హిందూ సంప్ర‌దాయ ప్ర‌కారం జరిగే పండుగ‌ల‌న్నింటిని పీసీ ఆమెరికాలో జ‌రుపుకుంటుంది. ఇలా ఎంతో సంతోషంగా సాగిపోతున్న వారి జీవితాల్లో విడాకులు అనే ప్ర‌చారం చొర‌బ‌డింది. అందుకు కార‌ణం లేక‌పోలేదు. న‌వంబ‌ర్ లో ప్రియాంక చోప్రా త‌న పేరు చివ‌ర‌న జోనాస్ ని తొల‌గించడంతో నెటిజ‌నుల‌కు సందేహం వ‌చ్చింది.

ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ఫ‌ర్ధ‌లు త‌లెత్తాయ‌ని విడాకులు తీసుకుంటున్నార‌ని ప్ర‌చారం సాగింది. అయితే ఈ వార్త‌ల్ని వెంట‌నే ప్రియాంక చోప్రా త‌ల్లి ఖండించింది. అవ‌న్నీ పుకార్లని...అర్ధం లేని క‌ట్టు క‌థ‌నాల‌ని మండిప‌డ్డారు. తాజాగా వీటిపై పీసీ కూడా స్పందించింది. ఇలాంటి ప్ర‌చారాలు ప్ర‌మాద‌క‌రమైన‌వి. వృత్తి పరంగానూ హానిక‌ర‌మైన‌వి. ఆన్ లైన్ లో ఓ చిత్రాన్ని పోస్ట్ చేస్తే అది కూడా పరిశీలించ‌బ‌డుతుంద‌ని పీసీ వాదించింది. నెటిజ‌నులు ఆ చిత్రాన్ని జూమ్ చేస్తారు. ఈ రోజుల్లో సోష‌ల్ మీడియాలో జ‌రిగే సంద‌డికి ఓ విశ్వ‌స‌నీయత‌ ఉంద‌ని న‌మ్ముతున్నాన‌ని పీసీ తెలిపింది.

ఇటీవ‌లే ప్రియాంక చోప్రా సినిమాల విష‌యానికి వ‌స్తే ఇటీవ‌లే ఆమె న‌టించిన హాలీవుడ్ చిత్రం `ది మ్యాట్రిక్స్ రిసరెక్ష‌న్స్` రిలీజ్ అయింది. అలాగే హాలీవుడ్ సిరీస్ `సిటాడెల్` పైప్ లైన్ లో ఉంది. అమ్మ‌డు న‌టించిన చివ‌రి థియేట్రిక‌ర్ రిలీజ్ `ది స్కై ఈజ్ పింక్. ఆ త‌ర్వా `ది వైట్ టైగ‌ర్` ఓటీటీలో రిలీజ్ అయింది. ఇక బాలీవుడ్ విష‌యానికి వ‌స్తే కొంత కాలంగా హిదీ సినిమాల‌కు దూరంగా ఉంటోంది.