వీడియో: పీసీ బెడ్ రూమ్ రొమాన్స్ లీక్

Wed Oct 09 2019 11:37:36 GMT+0530 (IST)

Priyanka Chopra Bedroom scene with Farhan Akhtar going viral in Social media

అందాల ప్రియాంక చోప్రా అలియాస్ పీసీ అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రియానిక్ జంట అన్యోన్య దాంపత్యం అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ హాలీవుడ్ మీడియాలు ఈ జోడీపై ఎన్ని కట్టుకథలు అల్లినా అదేమీ నమ్మకుండా పీసీ-నిక్ జోడీ తమ పెళ్లి ప్రమాణానికి కట్టుబడి లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. కష్టం.. దుఃఖం.. సంతోషం ఏదైనా ఒకరితో ఒకరు భాగం అవుతున్నారు. ఈ జంట తమ సొంత ఇంటిని అమ్మేసి ప్రస్తుతం ఓ కొత్త ఇంటికోసం వెతుకుతున్నారని ప్రచారమైంది.ఇక ఇదంతా ఒకెత్తు అనుకుంటే.. పీసీకి సంబంధించిన ఓ ఘాటైన బెడ్ రూమ్ వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లోకి రివీలైంది. ఈ వీడియోలో సహనటుడు ఫర్హాన్ అక్తర్ తో ప్రియాంక చోప్రా ఘాటైన రొమాన్స్ చేస్తోంది. అది కూడా బెడ్ రూమ్ సీక్రెట్ కి సంబంధించిన వీడియో బయటకు రావడంతో.. ఏమిటి పెళ్లి తర్వాత కూడా ఇలానా! అంటూ అభిమానులు షాక్ కి గురయ్యారు.

అయితే ఇది సినిమా కోసం రూపొందించిన సన్నివేశమా?  లేక రియల్ గా దొరికారా ఇలా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వీడియో అంత రొమాంటిక్ గా టూమచ్ గా అనిపించింది. అయితే ప్రియాంక చోప్రా- ఫర్హాన్ జోడీ `ది స్కై ఈజ్ పింక్` అనే చిత్రంలో భార్యాభర్తలు గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాలో ఇలా మరీ ఇన్ వోర్ లో అంత ఘాటుగా రొమాన్స్ చేసిన విజువల్స్ ని చూపిస్తున్నారా?  పీసీ మరీ ఫర్హాన్ బాటమ్ వేర్ తొలగించి చూసేంతగా చెలరేగిందేమిటి? ఒకవేళ ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ జారీ చేశారా? ఈ శుక్రవారం (అక్టోబర్ 11న) రిలీజ్ సందర్భంగా ప్రచారం కోసమే ఈ వీడియోని రిలీజ్ చేశారా? ఇలా ఎన్నో సందేహాలు నెలకొన్నాయి.

వీడియో కోసం క్లిక్ చేయండి