దుబాయ్ సెంటు..జపాన్ పౌడర్ అద్దిన పీసీ !

Wed Dec 08 2021 16:00:01 GMT+0530 (IST)

Priyanka Chopra And Nick Jonas

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ మధ్య మనస్పర్ధలు తలెత్తాయని..ఆ కారణంగా వివాహ బంధానికి గుడ్ బై చెప్పేస్తున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. మూడేళ్ల ధాంపత్య బంధానికి స్వస్తి చెబుతున్నట్లు బాలీవుడ్ మీడియా సైతం వేడెక్కించింది.  అవన్నీ గాలి వార్తలని...తమ వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుందని ఈ జంట ప్రూవ్ చేసింది. ఇటీవలే లండన్ వేదికగా ఇద్దరు మూడవ పెళ్లి  వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. దానికి సంబంధించిన ఓ వీడియోని నిక్ ఇన్ స్టాలో అభిమానులకు షేర్ చేసి విమర్శించిన వాళ్లకి ధీటైన సమాధానం ఇచ్చారు. `ఫర్ ఎవర్` ఎప్పటికీ ఇలాగే ఉంటామని అందరి నోళ్లు మూయించారు.తాజాగా ఈ జంట మరికొన్ని కొత్త ఫోటోల్ని ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది. ఇందులో పీసీ సోలో ఫోటోలు కొన్ని ఉంటే...హబ్బీ నిక్ జోనాస్ తో క్లోజ్ గా వేడుకును సెలబ్రేట్ చేసుకుంటున్న మరికొన్ని పిక్స్ ఉన్నాయి. ఇందులో ప్రియాంక చోప్రా- నిక్ స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తోన్న పిక్స్ హైలైట్ గా నిలిచాయి. దుబాయ్ సెంటు...జపాన్ పౌండర్...మలేషియా మల్లెపువ్వులతో అలకరించినట్లు పీసీ సహజసిద్దంగా ముస్తాబైంది. ఇక నిక్ కూడా కొత్త పెళ్లి కొడుకులా ముస్తాబై కళకళలాడుతున్నాడు. ఇద్దరు  కళ్లకు నల్ల అద్దాలు ధరించి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించారు. అలాగే పీసీ ఎద అందాలు హైలైట్ అవుతోన్న మరికొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి.

పీసీ-నిక్ ల వివాహం జోద్ పూర్ లోని ఉమైద్ భవనంలో జరిగిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు..అతికొద్ది మంది బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. పెళ్లికి భారీగానే ఈ జంట ఖర్చు చేసింది. విక్కీ కౌశల్-కత్రినా కైఫ్  కూడా ఈ నెలలోనే వివాహం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏ సెలబ్రిటీ పెళ్లికి ఎంత ఖర్చు అయింది? అన్న అంశం కూడా తెరపైకి వస్తుంది.