Begin typing your search above and press return to search.

పెళ్లయినా రొమాన్స్ ఆపేలా లేదుగా.. ఈ గ్లోబల్ బ్యూటీ!!

By:  Tupaki Desk   |   11 Aug 2020 2:30 AM GMT
పెళ్లయినా రొమాన్స్ ఆపేలా లేదుగా.. ఈ గ్లోబల్ బ్యూటీ!!
X
అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ తో పెళ్లయ్యాక గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా పూర్తిగా ఫారెన్ సంస్కృతినే ఫాలో అవుతున్నట్లుగా అనిపిస్తుంది. తన కట్టు బొట్టు వాలకం అన్నీ పాశ్చాత్య సంస్కృతిలోనే ఉన్నాయని ఆమెను చూసే చెప్పవచ్చు. ఫారెన్ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా.. ఆ మాత్రం పోకడలు పోతుందిలే అని అందరూ సర్దుకుంటున్నారు. కానీ ప్రియాంక మాత్రం పొట్టి పొట్టి డ్రెస్సులు ధరించడం.. వాటిని సర్దుకోవడం మర్చిపోతున్నట్లుంది. ఇదిలా ఉంటే ప్రియాంక పెళ్ళై రెండేళ్లు గడిచినా భర్తతో పబ్లిక్ రొమాన్స్ మాత్రం ఆపలేదు. ఇద్దరు ఒకరినొకరు ఫాలో అవుతున్నారు. ఏదో పెళ్లయిన కొత్తలో అంటే మాములే అనుకుంటాం.. కానీ రెండేళ్లు ముగిసాక కూడా వీళ్ళ రొమాన్స్ కి హద్దులు లేకుండా పోతుంది. ఇకనైనా ఇద్దరు కాస్త పబ్లిక్ లో బెస్ట్ కపుల్ గా ఉండటానికి ట్రై చేస్తే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

పెళ్లికి ముందు అందాల ప్రదర్శన ఓ రేంజిలో చేసిన ప్రియాంక.. పెళ్లి తర్వాత కూడా అదే రేంజిలో రెచ్చిపోతుంది. ఆ మధ్య గ్రామీ అవార్డుల ఫంక్షన్లో అయితే చూపు తిప్పుకోలేని విధంగా మతులు పోగొట్టింది. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న ఈ భామ భర్తతో ఫారెన్ లోనే ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఏదొక పోస్ట్ తో అభిమానులను అలరిస్తుంది. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను కలిగిన ఇండియన్ హీరోయిన్లలో ప్రియాంక టాప్ లోనే ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో అమ్మడు తన భర్తతో కలిసి వర్కౌట్ చేస్తున్న పిక్ షేర్ చేసింది. ఆ ఫోటోలో భర్త నిక్ జోనస్ పుష్ అప్స్ చేస్తుంటే భర్త పై కూర్చొని పోజిచ్చింది భామ. అంతేగాక పుష్ అప్స్ తన ఫేవరెట్ అంటూ కాప్షన్ జోడించింది. ఇక ప్రియాంక ప్రస్తుతం పలు హాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీ ఉన్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా అమ్మడు మాత్రం కుర్రకారును డిస్టర్బ్ చేస్తూనే ఉందని కామెంట్స్ చేస్తున్నారు.