Begin typing your search above and press return to search.

వీడియో: పీసీ కొత్త వ్యాపారం ఏంటో తెలిస్తే షాక్ లే!

By:  Tupaki Desk   |   5 July 2022 3:46 PM GMT
వీడియో: పీసీ కొత్త వ్యాపారం ఏంటో తెలిస్తే షాక్ లే!
X
పెట్టి పుట్టాల‌ని అంటారు! పెద్దింటికి కోడ‌లుగా వెళ్లిన పిల్ల‌కు అన్నీ అనుకూలంగా కుద‌ర‌వు. కొన్నిసార్లు అత్తింటి ఆర‌ళ్లు భ‌రించాలి. కానీ పీసీ అలియాస్ ప్రియాంక చోప్రాకు అలాంటివేవీ లేవ్. పైగా అత్తింట్లో కూతురిలాగా వెలిగిపోతోంది. భ‌ర్త నిక్ జోనాస్ క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకుని ప్రేమ‌గా లాల‌న‌గా చూసుకుంటున్నాడు. ఇక పీసీ హాలీవుడ్ లోనే కాస్ట్ లీ సింగ‌ర్ గా పేరున్న జోనాస్ బ్ర‌ద‌ర్ ని పెళ్లాడ‌డం ఇండియాలో చాలా మంది క‌థానాయిక‌ల‌కు కుళ్లుకునేలా చేసిందంటే అతిశ‌యోక్తి కాదు.

పీసీ రిచ్ యాంబియెన్స్ ఖ‌రీదైన యాటిట్యూడ్ రొమాంటిక్ లైఫ్ ప్ర‌తిదీ కుళ్లుకుపోయేలా చేసేవే. ఇక ఇప్పుడు ఈ వీడియోలో పీసీ ఇటీవ‌ల ప్రారంభించిన కాస్ట్ లీ వెంచ‌ర్ గురించి తెలిస్తే షాక్ తినాల్సిందే. ఇది ఓ ప‌బ్లిసిటీ క్యాంపెయిన్ అయినా కానీ ఎంతో ఆస‌క్తిని పెంచుతోంది.
అమెరికా కోడ‌లు ప్రియాంక చోప్రా ఇటీవల సోనా హోమ్ ను ప్రారంభించింది. ఇక్క‌డ ల‌గ్జ‌రీ బ్రాండ్ గృహోప‌క‌ర‌ణాలు ల‌భిస్తాయి. పీసీ భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా పాపుల‌ర్ ఫిగ‌ర్ కావ‌డంతో త‌న‌తో బ్రాండింగ్ ఉత్కంఠ‌ను పెంచింది.

న్యూయార్క్ లో సోనా అనే రెస్టారెంట్ ను కూడా పీసీ ఇంత‌కుముందు ప్రారంభించింది. ఇందులో త‌నకు న‌చ్చిన విలాస‌వంత‌మైన ఫుడ్ ని కూడా ప‌రిచ‌యం చేసింది. ఈ వ్యాపారం ప్ర‌స్తుతం మూడు పువ్వులు ఆరు కాయ‌ల్లా వ‌ర్ధిల్లుతోంద‌ని స‌మాచారం. ఇంత‌లోనే సోనా హోమ్ అంటూ గృహోప‌క‌ర‌ణాల వ్యాపారాన్ని ప్రారంభించేయ‌డం షాక్ నిస్తోంది. పీసీ హ‌ద్దులు లేకుండా ఎంట‌ర్ ప్రెన్యూర్ క్వాలిటీతో ఆక‌ర్షిస్తోంది.

పీసీ ఇప్ప‌టికే చాలా ర‌కాల వ్యాపారాలు చేస్తోంది. అనోమలీ అనేది ఆమె హెయిర్ కేర్ బ్రాండ్.. ఇది కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ప్రియాంక పర్పుల్ పెబుల్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ని సొంతం చేసుకుంది. ఇది అన్ని చోట్లా అభిమానులతో విజయవంతమైంది. ఇంత‌లోనే ప్రియాంక చోప్రా తన లగ్జరీ హౌస్ వేర్ బ్రాండ్ సోనా హోమ్ ను కూడా ప్రారంభించింది.

సోనా హోమ్ లో గృహాలంకరణ శ్రేణిని పరిచయం చేయడం ద్వారా తన వ్యాపారాల విల‌క్ష‌ణ‌తను చాటాల‌ని నిర్ణయించుకుందిట‌. SONA హోమ్ ఇప్పటికే పశ్చిమ దేశాల్లో ఉన్న కాస్ట్ లీ సెల‌బ్రిటీల‌ గృహాలలో పాపులారిటీని పెంచుకుంద‌ని తెలిసింది. ఎగువ త‌ర‌గ‌తి వారి నుంచి అధిక డిమాండ్ క‌నిపిస్తోంద‌ట‌. సోనా హోమ్ అతిథి దేవో భవ అనే క్యాప్ష‌న్ తో పాపుల‌ర‌వుతోంది. సోనా హోమ్ ద్వారా ప్రియాంక చోప్రా త‌న‌ వ్యాపార భాగస్వామి మనీష్ కె గోయల్.. స్నేహితులు కుటుంబ సభ్యులతో అందమైన జ్ఞాపకాలను తాజా వీడియోలో పంచుకుంది పీసీ.

ఈ హౌస్ ఫైన్ బోన్ చైనా.. విలాసవంతమైన లినెన్ లు మెరిసే ఉపకరణాలతో కూడిన అధునాతన గ్లోబల్ ఉత్ప‌త్తుల‌తో మెరుస్తోంది.
సోనా హోమ్‌ని ప్రారంభించడం తో త‌న రేంజు ఏంటో గ్లోబ‌ల్ వ‌ర‌ల్డ్ కి తెలుస్తోంద‌న్న ప్ర‌శంస అందుకుంటోంది పీసీ. ప్రియాంక చోప్రా వినోదం- పాప్ సంస్కృతి- సినిమా ప్రపంచంలోనే కాకుండా వ్యాపారంలో కూడా తనను తాను ఒక ఐకాన్ గా నిరూపించుకుంటోంది.

ప్రియాంక చోప్రా చివరిసారిగా మ్యాట్రిక్స్ 4లో సతీ పాత్రలో కనిపించింది రస్సో బ్రదర్స్ సిటాడెల్ అనే అమెరికన్ టీవీ సిరీస్ లోనూ న‌టిస్తోంది. ఫర్హాన్ అక్తర్ - జోయా అక్తర్ తెర‌కెక్కిస్తున్న జీ లే జరా అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. కత్రినా కైఫ్ - అలియా భట్ ల‌తో పాటు పీసీ ఇందులో క‌నిపించ‌నుంది.