Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : పికాసో చిత్రమా.. ఎల్లోరా శిల్పమా..!

By:  Tupaki Desk   |   3 Dec 2022 2:30 AM GMT
ఫోటో స్టోరీ : పికాసో చిత్రమా.. ఎల్లోరా శిల్పమా..!
X
ఈమధ్య కాలంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు, తమిళ భాషల్లో సందడి చేస్తున్న భామల్లో ఒకరు ప్రియాంక అరుల్ మోహన్. కన్నడ లో తాండవ్ రామ్ తో కలిసి చేసిన ఒంద్ కథె హెల్ల మూవీతో తెరంగేట్రం చేసిన ప్రియాంక మోహన్ ఆ తర్వాత తెలుగులో నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ లో ఛాన్స్ అందుకుంది. సినిమా ఫలితం నిరాశపరచిన ప్రియాంక మాత్రం మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఇక్కడే నెక్స్ట్ సినిమా శర్వానంద్ తో శ్రీకారం లో నటించింది ప్రియాంక. అయితే ఆ సినిమా కూడా నిరాశ పరచడం తో కోలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది.

మాతృ భాషలో మంచి అవకాశాలు అందుకుంటుంది ప్రియాంక. శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన వరుణ్ డాక్టర్ సినిమా లో నటించి సూపర్ హిట్ అందుకున్న ప్రియాంకా ఆ సినిమా హిట్ తో ఏకంగా స్టార్ హీరో సూర్య తో కలిసి జోడీ కట్టే ఛాన్స్ అందుకుంది.

ఈటీ అంటూ వచ్చిన ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర విఫలమైంది. ఇక తన కెరీర్ లో మొదటి హిట్ ఇచ్చిన శివ కార్తికేయన్ తోనే మరోసారి డాన్ సినిమాలో కలిసి నటించింది ప్రియాంక. శివ కార్తికేయన్ కు ప్రియాంకా లక్కీ హ్యాండ్ అయ్యింది. అందుకే వరుణ్ డాక్టర్ తర్వాత వచ్చిన డాన్ కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది.

ప్రస్తుతం ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ సినిమాలో నటిస్తున్న ప్రియాంక. ఆ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుంది. అరుణ్ మత్తేశ్వరన్ ఈ మూవీని భారీ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. దీనితో పాటుగా రమేష్ డైరెక్షన్ లో సినిమా చేస్తుంది ప్రియాంక అరుల్ మోహన్. సినిమాలతో ఈక్వల్ గా తన సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తో అలరిస్తుంది ప్రియాంక.

లేటెస్ట్ గా అమ్మడు శారీ లుక్ తో సర్ ప్రైజ్ చేసింది. లైట్ కలర్ శారీలో తన ఫోటో షూట్ తో కుర్రాళ్లని డిస్టర్బ్ చేస్తుంది ప్రియాంక. అమ్మడి ఈ ఫోటో షూట్ చూసి నెటిజన్లు సూపర్ కామెంట్స్ చేస్తున్నారు. పికాసో చిత్రమా.. ఎల్లోరా శిల్పమా అంటూ కామెంట్స్ తో ఆమె ఇన్ బాక్స్ ఫుల్ చేస్తున్నారు.

యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ప్రియాంక ఇప్పుడు చేస్తున్న స్టార్ సినిమాలతో స్టార్ ఇమేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది. ప్రియాంక చేస్తున్న ఫోటో షూట్స్ కూడా ఆమె కెరీర్ కు హెల్ప్ అయ్యేలా ఉన్నాయి. అయితే గ్లామర్ షో లో మాత్రం అమ్మడు ఇంకా ఆసక్తి చూపించట్లేదు. తమిళంలో ఇప్పటికే బిజీ హీరోయిన్ అయిన ప్రియాంకా తెలుగులో కూడా నటించాలన్న ఇంట్రెస్ట్ చూపిస్తుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.