Begin typing your search above and press return to search.

క్రికెటర్ చెంప పగులకొట్టిన ప్రియమణి..కారణమిదే

By:  Tupaki Desk   |   8 April 2020 8:30 PM GMT
క్రికెటర్ చెంప పగులకొట్టిన ప్రియమణి..కారణమిదే
X
ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగు వెలిగిన ప్రియమణి ఇప్పుడు అవకాశాలు తగ్గిపోవడంతో టీవీ షోలు చేసుకుంటూ కాలం గడుపుతోంది. అప్పట్లో ఈమెకు ఓ క్రికెటర్ తో వివాదం వార్తల్లో నిలిచింది. అప్పటి నుంచి అసలు క్రికెటర్ కు, ప్రియమణికి ఏం జరిగిందన్న ఆసక్తి జనంలో ఉంది.

తాజాగా సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) సందర్భంగా చోటుచేసుకున్న ఈ వివాదంపై తాజాగా ప్రియమణి మనసు విప్పింది. సీసీఎల్ సందర్భం గా ఓ క్రికెటర్ ప్రియమణిని తాకరాని చోట తాకడంతో కోపం ఆపుకోలేక కొట్టేసిందట.. క్రికెటర్ ను చెంప దెబ్బ కొట్టిన ప్రియమణి అని వార్త వైరల్ అయ్యింది.

అసలు విషయాన్ని తాజాగా ప్రియమణి వెల్లడించింది. ఓ హోటల్లో ఉండగా.. ఓ క్రికెటర్ నా మొబైల్ ఫోన్ దొంగిలించాడని.. నాతో ఫ్రాంక్ మాట్లాడుతూ ఇబ్బంది పెట్టాడని ప్రియమణి తెలిపింది. చివరకు ఆ క్రికెటర్ స్వయంగా వచ్చి ఫోన్ ఇచ్చి మిస్ బిహేవ్ చేశాడని.. అతడిని కొట్టానని వచ్చిన వార్త నిజం కాదు అంటూ చెప్పుకొచ్చింది. వార్నింగ్ ఇచ్చి వదిలేశానని తెలిపింది.

దీంతో నాటి వివాదం మరోసారి వెలుగులోకి వచ్చింది. అయితే ఆ క్రికెటర్ ఎవరనే విషయాన్ని మాత్రం ప్రియమణి బయటపెట్టకపోవడం గమనార్హం.