Begin typing your search above and press return to search.

ప్రియమణి 'నారప్ప' ఫస్ట్ లుక్ విడుదల..అదరగొట్టిందిగా..!

By:  Tupaki Desk   |   4 Jun 2020 9:24 AM GMT
ప్రియమణి నారప్ప ఫస్ట్ లుక్ విడుదల..అదరగొట్టిందిగా..!
X
టాలీవుడ్ వైవిధ్య సినిమాల హీరో విక్టరీ వెంకటేష్ మరోసారి వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమానే నారప్ప. తమిళంలో ధనుష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘అసురన్’ సినిమాకి రీమేక్ గా ఇది రూపొందుతుంది. తెలుగులో ‘నారప్ప’గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. ఇక ఈ సినిమాతో మళ్లీ తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతుంది హీరోయిన్ ప్రియమణి. వెంకటేష్ సరసన ఈ సినిమాలో నటిస్తున్న ప్రియమణి ఫస్ట్ లుక్ పోస్టర్ ను నారప్ప టీమ్ ఈరోజు విడుదల చేసింది. ఎందుకంటే ఈరోజు నటి ప్రియమణి పుట్టినరోజు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా నటిస్తున్న ప్రియమణి ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదివరకే విడుదలైన ‘నారప్ప’ పోస్టర్స్‌లో వెంకటేష్ ఉగ్రరూపం దాల్చారు. ఊర మాస్ గెటప్‌లో వెంకటేష్ పూర్తి వైవిధ్యంగా కనిపిస్తూ సర్ ప్రైజ్ చేశారు. ఇక ఇప్పుడు ప్రియమణి ఫస్ట్ లుక్ లో ఎంతో కూల్ గా ఎడ్లబండి మీద కూర్చుని వెళ్తున్న పక్కా పల్లెటూరి మహిళగా లుక్ అదరగొట్టేసింది. ఈ సినిమాను చాలా సహజత్వంతో రూపొందివుతున్నారట చిత్ర యూనిట్. ప్రియమణి నారప్ప సినిమాతో పాటు రానా నటిస్తున్న 'విరాట పర్వం' సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. తాజాగా ప్రియమణి పోస్టర్ రిలీజ్ చేసి శుభాకాంక్షలు తెలిపింది నారప్ప యూనిట్. ఆల్రెడీ తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమా కాబట్టి.. నారప్ప పై గట్టి నమ్మకంతో ఉన్నారు నిర్మాతలు. ఈ సినిమాను సురేష్ బాబుతో పాటు క‌లైపులిథాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ప్రస్తుతం చివరి దశలో ఉన్న ఈ సినిమాను థియేటర్లు మొదలుకాగానే విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారట సురేష్ బాబు. మరి ఈ సినిమాతో ప్రియమణి మళ్లీ తెలుగులో బిజీ అవ్వాలని ఆశిస్తూ.. తుపాకీ మీడియా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు!