వీడియో గ్లింప్స్: 'భామా కలాపం' అదరహో!

Sun Jan 16 2022 17:57:01 GMT+0530 (IST)

Priyamani Bhamakalapam glimpse is here

ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ లో జాతీయ ఉత్తమనటి ప్రియమణి అద్భుత నటనను అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. డ్యాన్స్ రియాలిటీ షోల హోస్ట్ గా రాణిస్తూనే ప్రియమణి తన స్థాయికి తగ్గ పాత్రలు వచ్చినప్పుడు నటించేందుకు వెనకాడడం లేదు. కెరీర్ పరంగా బిజీబిజీగా ఉన్న ప్రియా.. వెబ్ చిత్రాలతోనూ బిజీగా ఉన్నారు.ప్రియమణి నటించిన భామాకలాపం వెబ్ ఫిల్మ్ నుండి గ్రిప్పింగ్ గ్లింప్స్ తాజాగా విడుదలైంది. ఆహా లో ఇది స్ట్రీమింగ్ కానుంది.  తెలుగు స్ట్రీమింగ్ స్పేస్ లో ప్రియమణికి తొలి మూవీ అని చెప్పాలి. భామాకలాపం ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేసిన కొన్ని రోజులకు తాజా గ్లింప్స్ విడుదలై దూసుకువెళుతోంది. దుర్గా మాతను పోలి ఉండే పాత్రలో కనిపించనుంది. ప్రియమణి గృహిణిగా ఇంట్లో ఉన్నా రకరకాల కోణాలను ఆవిష్కరించనుంది. తాజా గ్లింప్స్ కి 1 లక్ష మంది సబ్ స్క్రైబర్ లు ఉన్నారు. 1000 వంటకాలతో విజయవంతమైన యూట్యూబర్ గా ప్రియమణిని ఈ వీడియో చూపుతుంది. ఇంతకు ముందు చేయని పనికి ఇప్పుడు ఆమె సిద్ధమైంది. వీక్షకులలో ఉత్సుకతను పెంచే విధంగా ఈ వీడియోని రూపొందించారు.

ఇంతకుముందు ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఆమె చేతిలో బైనాక్యులర్ లు పట్టుకున్నట్లు కనిపించింది. కత్తి- బుట్ట- బిర్యానీ ప్లేట్- చీపురు- గుడ్డు - పూజా గది లో గంటను పట్టుకుని పది చేతులతో కనిపించింది. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన భామాకలాపం కి భరత్ కమ్మ సారథ్యంలో అభిమన్యు తడిమేటి దర్శకత్వంలో రూపొందింది. రాధే శ్యామ్- డియర్ కామ్రేడ్ వంటి చిత్రాలకు స్వరకర్త జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సుధీర్ ఈదర - బోగవల్లి బాపినీడు ఈ ప్రాజెక్ట్‌ని SVCC డిజిటల్ లో నిర్మిస్తున్నారు. దీపక్ కుమార్ కెమెరాను అందించారు.