#నిబద్ధత.. గాయం కిల్ చేస్తున్నా షూటింగ్ చేశాడు

Thu Jun 10 2021 07:00:01 GMT+0530 (IST)

Priyadarshi did not take care of the doctors  instructions but he completed the shooting.Priyadarshi

తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన `పెళ్లి చూపులు` చిత్రంతో ప్రియదర్శి దశ తిరిగిపోయింది. ఆ సినిమా తర్వాత దేవరకొండ పెద్ద హీరోగా ఎదిగితే దర్శి స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. ప్రస్తుతం అతడు క్షణం తీరిక లేనంత బిజీ. ఓవైపు ఓటీటీలు మరోవైపు సినిమాలతో అతడు పూర్తి బిజీగా ఉన్నాడు.ప్రియదర్శి నటించిన `ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్` వెబ్ సిరీస్ ఆహాలో ప్రసారం కానుంది. విద్యా సాగర్ దర్శకుడు కాగా.. వెటరన్ డైరెక్టర్ సురేష్ క్రిష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో దర్శి ధైర్యవంతుడైన యువకుడిగా కనిపిస్తారు. ఈ తరహా పాత్ర తన కెరీర్ లో ఇదే తొలిసారి. ఇకపోతే చిత్రీకరణ సమయంలో ప్రియదర్శి పాదాలకు పెద్ద దెబ్బ తగిలిందని తెలిసింది. గాయం పెద్దదే .. ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినా అదేదీ కేర్ చేయక అతడు షూటింగ్ ని పూర్తి చేసేశాడట. ఆ తర్వాత మూడు నెలల పాటు గాయం మానలేదు.

వృత్తి నిబద్ధతతో పని చేసే అరుదైన నటుడిగా ప్రియదర్శికి ఇప్పటికే గుడ్ నేమ్ ఉంది. అతడి నిబద్ధత విస్తృతంగా చర్చకు వస్తోంది. నేటితరం కమెడియన్లలో ప్రతిభావంతుడిగానూ అతడికి గుర్తింపు ఉంది.