Begin typing your search above and press return to search.

బీచ్ లో ప్రియా చెల‌రేగిపోయిందిగా

By:  Tupaki Desk   |   3 Oct 2022 4:30 PM GMT
బీచ్ లో ప్రియా చెల‌రేగిపోయిందిగా
X
చిట్టి పొట్టి నిక్క‌రుతో బీచ్ లో దుమ్ము రేపుతోంది ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్. వింక్ గాళ్ గా కుర్ర‌కారు గుండెల్లో గుబులు రేపిన ఈ బ్యూటీ ఇటీవ‌లి కాలంలో క‌థానాయిక‌గా ఆశించిన విజ‌యాలు అందుకోవ‌డంలో త‌డ‌బ‌డిన సంగ‌తి తెలిసిందే.

ఒకే ఒక్క వింక్ (క‌న్ను గీటుడు)తో క‌థానాయిక‌గా దూసుకొచ్చింది. తొలి మ‌ల‌యాళీ చిత్రం `ఒరు ఆధార్ ల‌వ్` హిట్ కాక‌పోయినా త‌న‌కు ఆ సినిమా కెరీర్ ప‌రంగా పెద్దగా సాయ‌ప‌డింద‌నే చెప్పాలి. వింక్ గాళ్ గా త‌న పాపులారిటీతో ఇటు తెలుగు అటు హిందీలో అవ‌కాశాలు అందుకుంది. అయితే దుర‌దృష్ఠ‌వ‌శాత్తూ ఈ బ్యూటీ న‌టించిన సినిమాలేవీ స‌రిగా హిట్ కాలేదు. నితిన్ స‌ర‌స‌న `చెక్` మూవీలో న‌టించినా అది బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిలైంది. ఇష్క్ అనే చిత్రంలోనూ ప్రియా న‌టించినా క‌లిసి రాలేదు. క‌మ‌ర్శియ‌ల్ గా ఆ రెండు సినిమాలు స‌క్సెస్ కాక‌పోవ‌డంతో ప్రియా వారియ‌ర్ నిరాశ‌ప‌డింది. తెలుగులో ఇటీవ‌ల అవ‌కాశాల్లేవ్.

ప్రియా ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో స్పీడ్ గా ఉంటోంది. ఇటీవ‌లే థాయ్ ల్యాండ్ నుంచి పూల్ సైడ్ ట్రీట్ ని షేర్ చేసింది. స్విమ్ సూట్ లో ప్రియా ఎంతో హాట్ గా క‌నిపించింది. ఇంత‌లోనే ఇలా బికినీ బీచ్ నుంచి వ‌రుస ఫోటోల‌ను షేర్ చేసింది. వీటిలో జీరో మేకప్ లుక్ లో ప్రియా ఎంతో అందంగా క‌నిపిస్తోంది. ప్ర‌తి స్నాప్ లో ప్రియా ఎంతో అంద‌మైన చిరునవ్వుతో మెరిసింది. కొన్ని ఫ్రేమ్స్ లో బోల్డ్ లుక్ తో క‌నిపించ‌గా... తడిసిన చింపిరి జుత్తుతో క‌నిపించింది.

ప్రియా బ్లాక్ డెనిమ్ షార్ట్ ఆరెంజ్ టాప్ ని ధరించి అభిమానులను ఆకర్షించింది. ఈ లుక్ పై ప్రియా అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గుండె - ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తూ ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తున్నారు. వావ్ అంటూ ఒక అభిమాని ప్ర‌శంసించ‌గా... లావిష్ అని వండ‌ర్ ఫుల్ అని ప‌లువురు పొగిడేసారు.

అంతకుముందు ప్రియా కేరళలోని వర్కలా ప‌రిస‌రాల్లో తన ప్రయాణానికి సంబంధించిన కొన్ని ఫోటోల‌ను షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి. ప్రియా ఉబెర్-చిక్ బీచ్-రెడీ లుక్ తో మల్టీ-కలర్ బ్రాలెట్ ను ధరించి ఆక‌ట్టుకుంది.

ప్రియా ప్రకాష్ చివరిగా 2021లో తేజ సజ్జ సరసన ఇష్క్ చిత్రంలో నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక బాలీవుడ్ లో `శ్రీదేవి బంగ్లా` చిత్రం ర‌క‌ర‌కాల వివాదాల‌తో రిలీజ్ కి నోచుకోలేదు. అలాగే క‌న్న‌డ‌లో `విష్ణు ప్రియ` అనే చిత్రంలోనూ న‌టిస్తోంది. ప్ర‌స్తుతానికి ప్రియా వారియ‌ర్ ఆశ‌ల‌న్ని ఈ సినిమాపైనే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.