మమ్ముల్ని అపార్థం చేసుకుంటున్నారు

Tue Mar 26 2019 16:59:10 GMT+0530 (IST)

Priya Prakash Varrier React On Sridevi Bungalow Title

ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాకుండానే ప్రియా వారియర్ తన కన్ను గీటిన వీడియో మరియు ముద్దు గన్ వీడియోలతో దేశ వ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. ఈ మలయాళి ముద్దుగుమ్మ 'ఒరు ఆదార్ లవ్' చిత్రంతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఫలితం తారు మారు అయినా కూడా ఈమెకున్న క్రేజ్ నేపథ్యంలో బాలీవుడ్ లో సైతం ఆఫర్లు దక్కించుకుంటుంది. ఈమె గత కొన్నాళ్లుగా 'శ్రీదేవి బంగ్లా' అనే చిత్రంలో నటిస్తోంది. కొన్నాళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా టీజర్ తీవ్ర దుమారంను రేపిన విషయం తెల్సిందే.అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్ గా ఈ చిత్రం రూపొందుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టీజర్ విడుదల తర్వాత బోణీ కపూర్ ఆ సినిమాపై లీగల్ గా చర్యలు తీసుకునేందుకు సిద్దం అయ్యాడు. సినిమా నిర్మాత దర్శకుడు హీరోయిన్ పై బోణీ కపూర్ ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో నడుస్తోంది. కేసు నడుస్తున్నా కూడా సినిమా షూటింగ్ కొనసాగుతూ వస్తోంది. షూటింగ్ చివరి దశకు చేరిందని తెలుస్తోంది. తాజాగా హీరోయిన్ ప్రియా వారియర్ మీడియాతో మాట్లాడింది.

శ్రీదేవి బంగ్లా సినిమాలో అసలు హీరోయిన్ శ్రీదేవి గారి గురించి ఏం చూపించబోవడం లేదు. అసలు ఆ సినిమా శ్రీదేవి గారి బయోపిక్ కాదు ఆమెకు సంబంధించిన ఏ ఒక్క సీన్ కూడా ఇందులో ఉండదు. టైటిల్ ఆమె మరణం సమయంలోనే ఖరారు చేయడం జరిగింది. టైటిల్ అనేది కాకతాలీయంగా జరిగింది అంతే తప్ప ఆమె సినిమాను తీయాలనేది ఏమీ లేదని ఈ సినిమా పూర్తి కథ వేరు అని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉంటుందని సినిమా పూర్తి అయిన తర్వాత శ్రీదేవి ఫ్యామిలీ వారు చూస్తే తప్పకుండా వారు అడ్డు చెప్పరనే నమ్మకం వ్యక్తం చేసింది. టైటిల్ ను చూసి మమ్ముల్ని వారు అపార్థం చేసుకుంటున్నారు. అసలు శ్రీదేవి గారిని అగౌరవ పర్చే ఉద్దేశ్యమే తమకు లేదు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఈ చిత్రం విడుదల అవుతుందా లేదా అనేది చూడాలి.