పృధ్వీరాజ్ కి ప్రభాస్ కి భీకరమైన గొడవ!

Wed Aug 17 2022 22:00:01 GMT+0530 (IST)

Prithviraj and Prabhas have a terrible Fight!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'సలార్'. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. 'కేజీఎఫ్ చాప్టర్ 1 చాప్టర్ 2 వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ప్రస్తుతం అందరి దృష్టి 'సలార్'పై పడింది. అంతే కాకుండా ప్రభాస్ తో కలిసి ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడం 'కేజీఎఫ్' మేకర్స్ హోంబలే ఫిలింస్ అత్యంత భారీ బడ్జెట్ తో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా నిర్మిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై ఎక్స్ పెక్టేషన్స్  స్కై హైకి చేరుకున్నాయి.'కేజీఎఫ్' ప్రపంచానికి 'సలార్'కి కూడా ఇంటర్ లింక్ వుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా వుంటే ఈ ప్రాజెక్ట్ కి మరో క్రేజీ హీరోని దర్శకుడ ప్రశాంత్ నీల్ జత చేయడంతో ఈ వార్త విని ప్రభాస్ ఫ్యాన్స్ నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. చాలా రోజుల క్రితం ఈ మూవీలోని ఓ కీలక పాత్ర కోసం తనని ప్రభాస్ అడిగాడని మలయాళ క్రేజీ టాలెంటెడ్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడించిన విషయం తెలిసిందే.

అయితే కరోనా కారణంగా ప్రాజెక్ట్ ఆలస్యం కావడం తను అంగీకరించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ సెట్స్ పై వుండటంతో తాను చేయలేకపోయానని అవకాశం వుంటే ఇప్పడు చేస్తానని ఇటలీవల 'కడువా' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశాడు. రీసెంట్ గా ఈ మూవీ ఓటీటీలో విడుదలైంది. ఇదిలా వుంటే పృథ్వీరాజ్ సుకుమారన్ అన్న మాటలని తాజాగా నిజం చేసినట్టుగా తెలుస్తోంది.

తాజాగా 'సలార్' రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ చిత్ర బృందం కొత్త పోస్టర్ ని సోషల్ మీడియా వేదికగా  విడుదల చేసింది. ఈ సందర్భంగా హీరో పృథ్వీరాజ్ సుకుమార్ పేరుని కూడా జత చేస్తూ ట్యాగ్ చేసి ఈ మూవీలో తను నటిస్తున్నాడని ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేసి షాకిచ్చింది. సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్ ని చాలా పవర్ ఫుల్ గా ప్రశాంత్ నీల్ మలిచినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రభాస్ - పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య భీకరమైన పోరాట ఘట్టాలు వుంటాయని అవి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడం ఖాయం అని తెలుస్తోంది.

కేజీఎఫ్ చాప్టర్ 1 చాప్టర్ 2 లో హీరో ఎలివేషన్స్ తో అదరగొట్టిన ప్రశాంత్ నీల్ 'సలార్'లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - పృథ్వీరాజ్ సుకుమారన్ ల మధ్య ఏ స్థాయి ఎలివేషన్స్ తో రచ్చ చేయబోతున్నాడో తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.

ఒక్క యష్ తోనే థియేటర్లలో పూనకాలు తెప్పించిన ప్రశాంత్ నీల్ ఇక ప్రభాస్ - పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి ఇద్దరు పులలని ఓ రేంజ్ లో చూపించి థియేటర్లలని దద్దరిల్లెలా చేయడం ఖాయం అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో విశాల్ వదిన శ్రియారెడ్డి  కూడా కీలక పాత్రలో కనిపించబోతోంది.