Begin typing your search above and press return to search.

బోయపాటి రామ్ సినిమాలో విలన్ గా యంగ్ హీరో

By:  Tupaki Desk   |   7 Feb 2023 8:00 AM GMT
బోయపాటి రామ్ సినిమాలో విలన్ గా యంగ్ హీరో
X
స్టార్ డైరెక్టర్ లో బోయపాటి శ్రీను స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలిసిందే. మాస్ సినిమాలకు కేరాఆఫ్ అడ్రస్ బోయపాటి. బోయపాటి సినిమాలు అంటే భారీ హిట్ ఖాయమనే అనుకుంటారు. ఆయన దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య వచ్చిన అఖండ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్స్ కూడా భారీ రేంజ్ లో వచ్చాయి.

ప్రస్తుతం యంగ్ హీరో రామ్ పోతినేనిని డైరెక్ట్ చేస్తున్నారు. రామ్ చివరిగా లింగుస్వామి దర్శకత్వంలో వారియర్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. రామ్ తన కెరీర్ లో మొదటి సారి పోలీస్ పాత్రలో నటించాడు. రామ్ తో బోయపాటి ఊర మాస్ మసాలా మూవీ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ గా ఓ హీరో నటించనున్నాడని టాక్. బోయపాటి సినిమాల్లో విలన్ పాత్రలను చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇందుకోసం ఆయన సీనియర్ హీరోలను ఎంచుకుంటూ ఉంటారు. లెజెండ్ సినిమాలో జగపతి బాబును, అఖండ సినిమాలో శ్రీకాంత్ ను విలన్ గా మార్చారు బోయపాటి. ఇప్పుడు రామ్ సినిమా కోసం కూడా ఓ హీరోతో విలన్ వేషం వేయించనున్నారని తెలుస్తుంది. అత్యంత భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తుండగా ప్రిన్స్ ఈ సినిమాలో విలన్ రోల్ లో కనిపించనున్నరనీ టాక్. ప్రిన్స్ ను పవర్ ఫుల్ గా బోయపాటి శ్రీను చూపించనున్నారని తెలుస్తోంది.

రామ్, బోయపాటి సినిమాలో ప్రిన్స్ రోల్ సినిమాకు హైలెట్ కానుందని తెలుస్తోంది. ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ను ప్రిన్స్ కోసం బోయపాటి శ్రీను రాసినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. తేజ దర్శకత్వంలో వచ్చిన నీకు నాకు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరో ప్రిన్స్. బస్ స్టాప్, నేను శైలజ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నడు

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.