అందంగా హాయ్ చెబుతోందిగా వరల్డ్ ఫేమస్ ఢిల్లీసుందరి!!

Fri Jan 22 2021 23:00:01 GMT+0530 (IST)

Pretty much saying world famous Miss Delhi !!

అందమైన హీరోయిన్లు ఇండస్ట్రీలో ఎంతోమంది ఉంటారు. కానీ కొందరు మాత్రమే ఎల్లప్పుడూ కుర్ర గుండెలను తడుతూ ఉంటారు. అలాంటి టాలీవుడ్ అందగత్తెలలో ముందు వరుసలో ఉంటుంది సొట్టబుగ్గల రాశిఖన్నా. ఓ ఏడాది ముందంటే మొహానికి ఎలాంటి అడ్డులేకుండా వయ్యారంగా కెమెరాలకు పోజిచ్చేవారు హీరోయిన్లు. కానీ ఎప్పుడైతే కరోనా ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుండి మొహాలకి అడ్డులేకుండా బయట కనిపించడం లేదు. అయితే ఎంత దాచినా అభిమానులు గుర్తించడం మర్చిపోతారా.. తమ అభిమాన సెలబ్రిటీ ఎక్కడ కనిపించినా ఇట్టే గుర్తుపట్టి సెల్ఫీలు ఫోటోలు అంటూ ఎగబడతారు. తాజాగా అమ్మడు హైదరాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో మాస్క్ ధరించి వయ్యారంగా తారసపడింది. అంతే క్లిక్ మనిపించేశారు అభిమానులు..తాజాగా విమానాశ్రయంలో స్టైలిష్ బుట్టబొమ్మలా కెమెరా కంటపడింది. రాశి చివరిగా గతేడాది 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో కనిపించింది.అమ్మడి వాలకం చూస్తుంటే తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతేగాక ప్రస్తుతం రాశి చేతినిండా తమిళ సినిమాలే ఉన్నాయి. రాశి 2018లో 'ఇమైక నొడిగళ్' సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సినిమా మంచి విజయం సాధించి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో ఫోటో షూట్ లతో చిచ్చుపెడుతోంది. అరణ్మనై-3 మేధావి తుగ్లక్ దర్బార్ సైతాన్ క బచ్చాలను వరుసగా తమిళ సినిమాలలో నటిస్తోంది. అయితే అటు గ్లామర్ రోల్ అయినా ఇటు ట్రెడిషనల్ రోల్ అయినా ఇట్టే ఆకట్టుకుంటుంది రాశి. చూస్తుంటే ఈ ఏడాది అసలు కాల్ షీట్స్ ఖాళీగా ఉన్నట్లు లేదు. ఇక ఎయిర్ పోర్ట్ లో అమ్మడు బెలూన్ స్టైల్ డ్రెస్సింగ్ తో అలాగే మాస్క్ ధరించి కెమెరా వైపు చూస్తూ అందంగా హాయ్ చెబుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఢిల్లీ సుందరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.