Begin typing your search above and press return to search.

తీవ్ర ఒత్తిడిలో RRR హీరోలు..?

By:  Tupaki Desk   |   7 July 2022 11:30 PM GMT
తీవ్ర ఒత్తిడిలో RRR హీరోలు..?
X
'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ కు వచ్చిన రేంజ్ లో కాకపోయినా.. ఎస్ఎస్ రాజమౌళి సినిమా కారణంగా నార్త్ లో మంచి క్రేజ్ నే సొంతం చేసుకున్నారు.

ఇప్పుడు RRR హీరోలిద్దరూ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ తెచ్చుకునే ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే చెరో రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ను అధికారికంగా ప్రకటించారు. అయితే చరణ్ - తారక్ ఇద్దరూ తదుపరి సినిమాలతో హిట్టు కొట్టాల్సిన నేపథ్యంలో తీవ్ర ఒత్తిడితో ఉన్నట్లు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

'ఆర్.ఆర్.ఆర్' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ 'ఆచార్య' సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్నారు. ఇందులో చెర్రీ పాత్ర తక్కువ అయినప్పటికీ.. అతనికిది ఎంతో ప్రతిష్టాత్మక మూవీ. తొలిసారిగా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి పూర్తి స్థాయిలో నటించిన సినిమా ఇది.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆచార్య' సినిమాని RRR తో చరణ్ కు వచ్చిన క్రేజ్ కూడా కాపాడలేకపోయింది. దీంతో ఇప్పుడు నెక్స్ట్ మూవీతో కచ్చితంగా హిట్టు కొట్టి సత్తా చాటాల్సిన అవసరముంది. ఈ నేపథ్యంలో శంకర్ తో కలిసి RC15 సినిమా చేస్తున్నాడు చెర్రీ. వెంటనే గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకురావాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

మరోవైపు ట్రిపుల్ ఆర్ లో భాగమైన మరో హీరో జూనియర్ ఎన్టీఆర్ కాస్త ఎక్కువ ప్రెజర్ ని మోయాల్సి వస్తోంది. ముఖ్యంగా 'ఆచార్య' ఓటమి చరణ్ కంటే తారక్ ను ఎక్కువ ప్రభావితం చేస్తోంది. దీనికి కారణం NTR30 సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయడమే.

'ఆచార్య' పరాజయం తర్వాత దర్శకుడు కొరటాల డిస్ట్రిబ్యూటర్ నష్టాలను తీర్చే బాధ్యత తీసుకున్నారని టాక్. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ రూపంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ నుంచి వచ్చే మొత్తాన్ని నష్టపోయిన పంపిణీదారులకు సెటిల్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

'ఆచార్య' భారాన్ని దించుకున్న తర్వాతే సినిమా చేయాలని తదుపరి ప్రాజెక్ట్ షురూ చేయాలని భావిస్తున్నారట. నిర్మాత అయినప్పటికీ ప్లాప్ తర్వాత రామ్ చరణ్ చాలా త్వరగా దాన్నుంచి బయటపడ్డారని అనుకోవాలి. కానీ కొరటాల మాత్రం ఇంకా ఆ ఎఫెక్ట్స్ నుండి బయటకు రాకపోవడమనేది పరోక్షంగా ఎన్టీఆర్ పై ఒత్తిడి పెంచుతోందని అంటున్నారు.

ఇలా 'ఆర్.ఆర్.ఆర్' వంటి సక్సెస్ మూవీ తర్వాత హీరోలిద్దరూ ఒత్తిడిలో ఉన్నారనే చర్చ జరిగింది. అయితే ఇద్దరికీ డైరెక్టర్ కొరటాల శివ తోనే లింక్ ఉండటం గమనార్హం. మరి తారక్ - చరణ్ దీన్నుంచి బయటపడి తదుపరి చిత్రాలతో పాన్ ఇండియా స్టార్స్ అనిపించుకుంటారేమో చూడాలి.