Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: రాజ‌కుమారుడే షాక్ తింటాడేమో!

By:  Tupaki Desk   |   6 Aug 2020 6:30 AM GMT
ఫోటో స్టోరి: రాజ‌కుమారుడే షాక్ తింటాడేమో!
X
సొట్ట బుగ్గ‌ల సుంద‌రి ప్రీతిజింతాకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆ న‌వ్వుకి ఫ్యాన్సున్నారు తెలుసా? బుగ్గ‌ల్లో సొట్ట‌లు అంతగా మురిపిస్తాయి కుర్రకారును. ప్రిన్స్ మ‌హేష్ స‌ర‌స‌న రాజ‌కుమారుడు చిత్రంతో ప‌రిచ‌యం అయిన‌ప్పుడు యూత్ తెగ‌ ప‌రేషాన్ అయ్యారు. అందానికి అందం.. చ‌క్క‌ని న‌ట‌న .. క‌వ్వింతకు మైమ‌రిచారు. దాదాపు రెండు ద‌శాబ్ధాల క్రితం రాజ‌కుమారుడు రిలీజైంది.

రాజ‌కుమారుడుగా మ‌హేష్ న‌ట‌న‌కు ఎంత‌గా మంత్ర‌ముగ్ధం అయ్యారో.. ప్రీతి అంద‌చందాల‌కు అంతే మ‌త్తెక్కిపోయారు. ఆ త‌ర్వాత విక్ట‌రీ వెంక‌టేష్ స‌ర‌స‌న `ప్రేమంటే ఇదేరా` చిత్రంలో న‌టించింది. ఆ రెండు సినిమాలు బంప‌ర్ హిట్టే. ప్రీతి జింతా ఆ త‌ర్వాత బాలీవుడ్ కెరీర్ పైనే దృష్టి సారించింది.

బాలీవుడ్ కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలున్నాయి. దిల్ సే తో త‌‌న‌కు తొలి అవ‌కాశం ఇచ్చిన‌ షారూక్ స‌హా అగ్ర హీరోల సినిమాల్లో న‌టించింది. 2018లో వెల్ కం టు న్యూయార్క్- బ‌జాజి సూప‌ర్ హిట్ అనే రెండు చిత్రాలు చేసింది. ఆ త‌ర్వాత ఇక న‌ట‌న‌కు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ప్రీతి జింతా ఐపీఎల్ లో భాగ‌స్వామితో క‌లిసి పెట్టుబ‌డులు పెట్టిన సంగ‌తి గొడ‌వ‌ల గురించి తెలిసిందే. 2016లో జీన్ గూడెన‌ఫ్ అనే బిజినెస్ మేన్ తో ప్రీతి ల‌వ్వాయ‌ణం హాట్ టాపిక్ అయ్యింది. అదంతా స‌రే కానీ ప్రీతి జింతా ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లోనూ అంతే వైర‌ల్ గా మారుతోంది.

తాజాగా ప్రీతి ట్విట్ట‌ర్ లో రివీల్ చేసిన ఫోటో అంతే వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోలో మాస్క్ ధ‌రించి క‌నిపించింది. పింక్ డిజైన‌ర్ మాస్క్ కాంబినేష‌న్ డ్రెస్ .. ఓవ‌రాల్ గా పింక్ లో ప్రీతి అంద‌చందాలు మైమ‌రిపిస్తున్నాయి. ప్రాజెక్ట్ శానిటీ పేరుతో ప్రీతి మాస్క్ కి బాగానే ప్ర‌చారం చేస్తోంది. ఇక ప్రీతి మాస్కుకి ఐపీఎల్ ఆట‌గాళ్లంతా ఒక్కొక్క‌రుగా రిప్ల‌య్ ఇస్తారేమో చూడాలి.