Begin typing your search above and press return to search.

సంక్రాంతి సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత‌?

By:  Tupaki Desk   |   14 Jan 2022 5:34 PM GMT
సంక్రాంతి సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత‌?
X
ఈ సంక్రాంతికి భారీ పోటీ వుంటుంద‌ని అంతా భావించారు కానీ బ‌రిలో నిలవాల్సిన సినిమాలు ఆర్ ఆర్ ఆర్‌, రాధేశ్యామ్ ఒమిక్రాన్‌, కోవిడ్ కార‌ణంగా త‌ప్పుకోవ‌డంతో ఈ పండ‌గ సీజ‌న్ సెలబ్రేష‌న్స్ లేన‌ట్లే అంటూ అంతా నిట్టూర్చారు. అయితే అంద‌రిని స‌ర్ ప్రైజ్ చేస్తూ ఈ సంక్రాంతి బ‌రిలో నాలుగు చిత్రాలు నిలిచాయి. `బంగార్రాజు` రైడీ బాయ్స్‌, హీరో, సూప‌ర్ మ‌చ్చి. ఇందులో `బంగార్రాజు`, రౌడీ బాయ్స్, హీరో చిత్రాల‌పై మంచి క్రేజ్ ఏర్ప‌డింది.

ఇందులో భారీ చిత్రం మాత్రం బంగార్రాజే. ఇక ఈ మూవీతో పాటు `రౌడీ బాయ్స్‌`, సూప‌ర్ మ‌చ్చి జ‌న‌వ‌రి 14న విడుద‌లయ్యాయి. `సోగ్గాడే చిన్ని నాయ‌న‌` చిత్రానికి సీక్వెల్ కావ‌డంతో `బంగార్రాజు`పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అంతే కాకుండా క్రేజీ స్టార్స్ అంతా ఈ మూవీలో న‌టించ‌డం కూడా ఈ మూవీపై క్రేజ్ పెర‌గడానికి ప్ర‌ధాన కార‌ణంగా నిలిచింది. దీంతో సంక్రాంతి బ‌రిలో `బంగార్రాజు`దే పై చేయిగా మారింది.

ఇక ఈ మూవీతో పాటు జ‌న‌వ‌రి 15న `హీరో` మూవీ విడుద‌ల‌వుతోంది. విచిత్రం ఏంటంటే ఈ నాలుగు చిత్రాల్లోనూ వార‌సులు న‌టించారు. ఇందులో రెండు చిత్రాల ద్వారా ఇద్ద‌రు వార‌సులు ప‌రిచ‌యం అవుతున్నారు. `హీరో` తో మ‌హేష్ ఫ్యామిలీ నుంచి గ‌ల్లా అశోక్ ప‌రిచ‌యం అవుతుండ‌గా... `రైడీ బాయ్స్`తో దిల్ రాజు ఫ్యామిలీ వార‌సుడు ఆశిష్‌రెడ్డి ప‌రిచ‌యం అయ్యారు. దీంతో ఈ మూవీస్ కి కూడా భారీ క్రేజ్ ఏర్ప‌డింది.

`సూప‌ర్ మ‌చ్చి` చిత్రాన్ని మేక‌ర్స్ ఓన్ రిలీజ్ చేశారు. ఇక `హీరో` మూవీ 12 కోట్ల‌తో నిర్మిస్తే 8 కోట్లు బిజినెస్ జ‌రిగింది. మిగ‌తా ఏరియాల్లో ఓన్ గా రిలీజ్ చేశారు. `రౌడీ బాయ్స్‌` బ‌డ్జెట్ 12 కోట్లు.. నైజామ్ , ఆంధ్రాలో దిల్‌రాజు ఈ మూవీని ఓన్ రిలీజ్ చేశారు. మిగ‌తా ఏరియాల‌కు గానూ ఈ మూవీకి 6 కోట్లు వ‌చ్చాయి. మొత్తంగా దీని బ‌డ్జెట్ అంతా ప్రీరిలీజ్ బిజినెస్ లోనే వ‌చ్చేసింది. ఇక నాగార్జున, నాగ‌చైత‌న్య క‌లిసి న‌టించిన `బంగార్రాజు` భారీ మొత్తాల‌కు అమ్ముడు పోయింది.

ఈ మూవీ ప్రి రిలీజ్ బిజినెస్ 39 కోట్లు. క్రేజ్ కి త‌గ్గ‌ట్టే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఈ మూవీస్ కి జ‌రిగింది. అయితే ఇందులో ఇద్ద‌రు వార‌సులు న‌టించిన హీరో, రౌడీ బాయ్స్ చిత్రాల‌కు మాత్రం భారీగానే ఖ‌ర్చు చేశారు. మ‌రి అంత మొత్తం రిట‌ర్న్ అవుతుందా? అన్న‌దే ప్ర‌స్తుతం ట్రేడ్ వ‌ర్గాల మైండ్ ని తొలుస్తోంది. పండ‌గ సీజ‌న్ కావ‌డంతో అది సాధ్య‌మే అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.