బాలయ్య కోసం మల్లూ పిశాచిని దించుతున్నాడు

Sat Oct 17 2020 11:45:34 GMT+0530 (IST)

He is also bringing down the vampire for the Balayya

నటసింహా నందమూరి బాలకృష్ణ- బోయపాటి హ్యాట్రిక్ హిట్ కోసం సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ కారణంగా ఫిబ్రవరి నెలలో మొదటి షెడ్యూల్ ను ముగించిన తరువాత చిత్రీకరణను నిలిపివేశారు. ఇక ఈ మూవీలో నటించే కథానాయికల కోసం బోయపాటి నిరంతర సెర్చ్ లో ఉన్న సంగతి తెలిసిందే.తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీలో మలయాళీ ముద్దుగుమ్మ ప్రయాగ మార్టిన్ ఒక కథానాయికగా ఆడిపాడనుందని తెలిసింది. ప్రయాగ కేరళ బ్యూటీ. అక్కడ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్లలో నటించింది. ప్రయాగ మార్టిన్ విమర్శకుల ప్రశంసలు పొందిన తమిళ చిత్రం పిసాసు (పిశాచి -తెలుగు)లో నటించింది. ప్రయాగ అందాలకు యూత్ ఫిదా అయిపోయారు అప్పట్లోనే. ఇక ఈ అమ్మడు మల్లూవుడ్ లో లానే టాలీవుడ్ లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోందట. ఇక ఈ మూవీలో బాలకృష్ణ డబుల్ షేడ్ రోల్ చేయనున్న సంగతి తెలిసిందే. అఘోరాగా.. అలాగే బిజినెస్ మేన్ గా కనిపించనున్నారని గుసగుసలు వినిపించాయి.

ఇంతకీ ఈ మూవీ షెడ్యూల్ ఎప్పటి నుంచి? అన్నదానిపై ఇంకా బోయపాటి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. షూటింగ్ దసరా తరువాత తిరిగి ప్రారంభమవుతుందని వార్తలు వస్తున్నా.. దానిపై అధికారికంగా క్లారిటీ లేదు. సాహసం శ్వాసగా సాగిపో ఫేం మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇంకా ఇంకా టైటిల్ నిర్ణయించాల్సి ఉంది. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.