మట్టిలో మాణిక్యం అలా స్టార్ అయ్యాడు

Wed Sep 15 2021 05:00:01 GMT+0530 (IST)

Pratik Gandhi became famous through a web series

వెబ్ సిరీస్ ల కారణంగా మట్టిలో మాణిక్యాలు బయటకొస్తున్నాయి. వెండి తెరపై అవకాశాలు రానివారంతా బుల్లి తెరపై నిరూపించుకుని ప్రమోట్ అవుతున్నారు. అలాగే గుజరాతీ నటుడు ప్రతీక్ గాంధీ కూడా వెలుగులోకి వచ్చాడు. ఇతను గుజరాతీ.. ఇంగ్లీష్ భాషల్లో కొన్ని సినిమాలు చేసాడు. కానీ అవేవి తీసుకుని రాని ఐడెంటీటీని ఒక్క వెబ్ సిరీస్ తీసుకొచ్చింది. అదే `స్కామ్ 1992` వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ దేశ వ్యాప్తంగా పెద్ద సక్సెస్ అయింది. హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ కు మంచి ఆదరణ లభించింది.ఇందులో హర్షద్ పాత్రలో ప్రతీక్ గాంధీ నటించి విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. ఆ గుర్తింపు కారణంగానే బాలీవుడ్ లో `రావణ్ లీలా` లో నటించే అవకాశం అందుకున్నాడు. ఇదులో ప్రతీక్ రాజా రోమ్ జోషి పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ అవకాశం పట్ల ప్రతీక్ స్పందించాడు. `స్కామ్ 1992 కి ముందే దర్శకుడు గజ్జర్ `రావణ్ లీలా` స్క్రిప్ట్ వినిపించారు. కానీ అప్పుడు సినిమా లాంచ్ అవ్వలేదు. ఈ లోపు స్కామ్ 1992 రిలీజ్ అవ్వడం..సినిమా సెట్స్ కు వెళ్లడం.. చేయడం అంతా వేగంగా జరిగిపోయిందని నవ్వేసాడు. బహుశా స్కామ్ తెచ్చిన గుర్తింపు కారణంగానే అయి ఉంటుందని చెప్పకనే చెప్పాడు.

ఇలాంటి పాత్రలు చేయడం అంటే చాలా ఇష్టం. ఏ పాత్రనైనా ఎంపికచేసుకునే ముందు నన్ను నేను పరిశీలించుకుంటాను. చేయగలనని నమ్మకం..గట్స్ ఉంటేనే ఆ పాత్రకు ఒకే చెబుతాను. రాజారామ్ జోషి పాత్ర అలాంటిందే. పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. నేను థియేటర్ ఆర్టిస్ట్ ని . స్క్రిప్ట్ లో స్టేజ్ పెర్పార్మెన్స్ ఎక్కువగా ఆస్కారం ఉంది. ఆ రకంగా పాత్ర చేయడం నాకు కొంత వరకూ సులభమైంది. రాముడు...రావణుడు మధ్య జరిగే పోరు చాలా ఆసక్తికరంగా ఉంటుందని ప్రతీక్ తెలిపారు. ఓటీటీ కారణంగానే బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. ఎంతో మంది కొత్త వారు వస్తున్నారు. అందులో నేను ఒకడిని. ఈ వేదిక కేవలం నటులకు మాత్రమే కాదు. ఎంతో మంది టెక్నీషియన్ల కెరీర్ కి ఉపయోగకరంగా మారింది అన్నారు.